న్యూఢిల్లీ, జనవరి 1: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దేశ ప్రజలకు బుధవారం ‘ఎక్స్’ వేదికగా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి ఇంటా సంతోషాలు నిండాలని ఆకాంక్షించారు. యువత సరికొత్త అవకాశాలు అందిపుచ్చుకుని..ఉన్నత శిఖరాలు అధిరోహించాలని, తద్వారా దేశ ప్రగతికి దోహదపడా లని పిలుపునిచ్చారు.
అలాగే ప్రధాని మోదీ ‘కొత్త సంవత్సరంలో కొత్త అవకాశాలను అందిపుచ్చుకోవాలి. ప్రతిఇంటా ఆయురారోగ్యాలు, ఐశ్వర్యాలతో విలసిల్లాలి’ అని ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు. ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ ‘దేశ పౌరులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. మనమంతా 21వ శాతాబ్దపు త్రైమాసిక వసంతంలోకి అడుగుపెట్టాం. ఈ తరుణంలో రాజ్యాంగ విలువలను పెంపొందించేందుకు ప్రతిఒక్క రూ కృషి చేయాలి’ అని పిలుపునిచ్చారు.