calender_icon.png 12 December, 2024 | 11:23 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గుకేష్‌కు శుభాకాంక్షలు తెలిపిన రాష్ట్రపతి, ప్రధాని మోదీ

12-12-2024 08:14:25 PM

న్యూఢిల్లీ,(విజయక్రాంతి): ప్రపంచ చెస్ ఛాంపియన్ గా రికార్డు సాధించిన దొమ్మరాజు గుకేశ్ కు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. గుకేశ్ దేశాన్ని గర్వపడేలా చేశారని, చెస్ పవర్ హౌస్ భారత్ అని గుకేశ్ విజయం చాటిందని రాష్ట్రపతి హర్షం వ్యక్తం చేశారు. గుకేశ్ విజయం చరిత్రాత్మకమైనది, ఆదర్శప్రాయమైనదని ప్రధాని మోదీ అన్నారు. గుకేశ్ అసాధారణ ప్రతిభ, కృషి, సంకల్పమే ఈ ఫలితం అని ప్రధాని అభిప్రాయపడ్డారు. గుకేశ్ ప్రయణం మిలియన్ల మంది యువతకు స్పూరి అన్నారు. భవిష్యత్ ప్రయత్నాలకు నా శుభాకాంక్షలు అని మోదీ ట్వీట్ చేశారు. 18 ఏళ్లకే ఫిడే క్యాండిడేట్స్ చెస్ టోర్నీ విజేతగా నిలిచిన భారత యువ సంచలనం గుకేశ్​పై ప్రసంసల జల్లు కురుస్తోంది. అతడి విజయానికి పలువురు ప్రముఖులు సోషల్ మీడియాలో అభినందిస్తున్నారు.