calender_icon.png 4 April, 2025 | 12:21 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సిల్వర్ జూబ్లీ వేడుకల్లో పాల్గొన్న రాష్ట్రపతి

24-03-2025 11:49:57 PM

ఛత్తీస్‌గఢ్ నుంచి నక్సలిజాన్ని రూపుమాపే పని చివరి దశకు వచ్చింది..

రాయ్‌పూర్: ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీ 25 వసంతాలు పూర్తున నేపథ్యంలో ఏర్పాటు చేసిన ఈవెంట్‌కు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో రాష్ట్రపతి మాట్లాడారు. ‘ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీ అత్యున్నత ప్రజాస్వామ్య ప్రమాణాలను నిర్దేశించింది. గడిన 25 ఏండ్లుగా సభలో మార్షల్స్‌ను వాడకపోవడం సంతోషకరం. అత్యున్నత పార్లమెంటరీ వ్యవస్థకు ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీ ప్రత్యక్ష ఉదాహరణ.

కేవలం మన దేశంలో ఉన్న రాష్ట్రాలకు మాత్రమే కాకుండా ప్రజాస్వామ్యాన్ని పాటించే ప్రతి రాజ్యానికి ఇది ఉదాహరణగా నిలుస్తుంది. ఛత్తీస్‌గఢ్ అనేక రంగాల్లో ఎంతో అభివృద్ధి చెందుతోంది. అందమైన ఈ రాష్ట్రంలో ఎన్నో అరణ్యాలు ఉన్నాయి. 90 మంది ఉన్న అసెంబ్లీలో 19 మంది మహిళా ఎమ్మెల్యేలు ఉండడం అభినందనీయం. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలోని మహిళా ఓటర్ల సంఖ్య పురుష ఓటర్ల కంటే అధికం. మీ రాష్ట్రం త్వరలో నక్సలిజం నుంచి విముక్తి పొందుతుంది.’ అని తెలిపారు.