హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 18(విజయక్రాంతి): రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈనెల 21న హైదరాబాద్కు రానున్నారు. నగరంలో జరుగుతున్న కోటి దీపోత్సవం వేడుకల్లో రాష్ట్రపతి పాల్గొంటారు. ఈ నేపథ్యంలో నగరంలోని ఎన్టీఆర్ స్టేడియంలో పోలీస్, జీహెచ్ఎంసీ, ఆర్అండ్బీ, అగ్నిమాపక, విద్యుత్, వైద్య శాఖ అధికారులతో కోఆర్డినేషన్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్రపతి పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని సూచించారు. స్టేజీ ఏర్పాట్లపై ఆర్అండ్బీ శాఖ ధ్రువీకరించాలని చెప్పారు. అనంతరం ఎన్టీఆర్ స్టేడియంలో జరుగుతున్న ఏర్పాట్లను పరిశీలించారు. సెంట్రల్ జోన్ డీసీపీ ఆకాంక్ష్యాదవ్, డీఆర్వో వెంకటాచారి, ఆర్డీవో రామకృష్ణ, అధికారులు పాల్గొన్నారు.