న్యూఢిల్లీ: దేశ ప్రజలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ(Prime Minister Narendra Modi) నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసారు. 2025 అందరికీ కొత్త అవకాశాలు, విజయం, ఆనందాన్ని తీసుకురావాలని ఆకాంక్షించారు. భారతదేశం ప్రపంచానికి ఉజ్వలమైన, సమగ్రమైన, స్థిరమైన భవిష్యత్తును సృష్టించేందుకు కలిసి పని చేద్దామని రాష్ట్రపతి పిలుపునిచ్చారు. కొత్త సంవత్సరం అందరికీ కొత్త అవకాశాలు, విజయాలను అందించాలని ఆకాంక్షిస్తూ ప్రధాని నరేంద్ర మోదీ తన నూతన సంవత్సర శుభాకాంక్షలు (Happy New Year 2025) తెలిపారు. మన రాజ్యాంగ శతాబ్ది చివరి త్రైమాసికంలో ఈ సంవత్సరం దేశం అడుగుపెట్టిందని, మన రాజ్యాంగ నిర్మాతల దార్శనికతను సాకారం చేసుకునేందుకు మనల్ని మనం పునరంకితం చేసుకోవాల్సిన సమయం ఆసన్నమైందని ఉపాధ్యక్షుడు జగదీప్ ధన్‌ఖర్ అన్నారు.