న్యూఢిల్లీ: పారిస్ ఒలింపిక్స్‌లో కాంస్య పతకాన్ని సాధించినందుకు భారత హాకీ జట్టుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హృదయపూర్వక అభినందనలు తెలిపారు. ఐదు దశాబ్దాల తర్వాత భారత్ వరుసగా ఒలింపిక్ క్రీడల్లో కాంస్య పతకాలు సాధించిందని రాష్ట్రపతి ముర్ము అన్నారు.
భారత హాకీ పునరుజ్జీవనం కోసం జట్టు అత్యధిక ప్రశంసలకు అర్హమైనది. భారతదేశం గర్వపడేలా చేసిందని రాష్ట్రపతి కొనియడారు. హాకీ జట్లు చూపిన నిలకడ, నైపుణ్యాలు, సమన్వయం, పోరాట స్ఫూర్తి చాటిందన్నారు. భారత హాకీ జట్టు యవతకు ఆదర్శంగా నిలుస్తుందని రాష్ట్రపతి ముర్ము పేర్కొన్నారు.