న్యూఢిల్లీ,(విజయక్రాంతి): పారా-అథ్లెటిక్స్(Para-Athlete)లో అసాధారణ విజయాలకు గాను జీవన్జీ దీప్తి(Jeevanji Deepthi)కి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము(President Droupadi Murmu) అర్జున అవార్డు(Arjuna Award 2024)ను ప్రదానం చేశారు. తెలంగాణలోని వరంగల్ జిల్లా కల్లెడ గ్రామానికి చెందిన జీవన్జీ దీప్తి సాధించిన అద్భుతమైన విజయాలలో భాగంగా పారిస్‌లో జరిగిన 2024 పారాలింపిక్ క్రీడల్లో మహిళల 400 మీటర్ల T20 ఈవెంట్‌లో కాంస్య పతకం, జపాన్‌లోని కోబ్‌లో జరిగిన 2024 ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో అదే ఈవెంట్‌లో మరో కాంస్య పతకం అందుకున్నారు. అదనంగా, 2023లో చైనాలోని హాంగ్‌జౌలో జరిగిన 4వ ఆసియా పారా గేమ్స్‌లో మహిళల 400 మీటర్ల T20 ఈవెంట్‌లో దీప్తి బంగారు పతకాన్ని సాధించారు.