- తెలంగాణ హెడ్ కానిస్టేబుల్‌కు అత్యున్నత పతకం
- 1037 మందికి గ్యాలంట్రీ అవార్డుల ప్రకటన
తెలంగాణ నుంచి 29 మందికి అవార్డులు
యాదయ్యకు ఒక్కరికే రాష్ట్రపతి శౌర్య పతకం
కత్తిపోట్లకు గురైనా వెనుకడుగు వేయని సాహసం
హైదరాబాద్, ఆగస్టు 1౪ (విజయక్రాంతి): తెలంగాణకు చెందిన పోలీస్ హెడ్ కానిస్టేబుల్ చదువు యాదయ్యకు అత్యున్నత రాష్ట్రపతి గ్యాలంట్రీ అవార్డు లభించింది. చైన్ స్నాచర్లను పట్టుకొనే క్రమంలో కత్తిపోట్లకు గురైనా వెనుకడుగు వేయకుండా విధి నిర్వహణలో అసామాన్య సాహసాలు ప్రదర్శించినందుకు యాదయ్యను అ అవార్డుకు ఎంపిక చేసినట్టు కేంద్ర హోంశాఖ బుధవారం ప్రకటించింది. స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని పోలీసు, ఫైర్ సర్వీస్, హోంగార్డ్, సివిల్ డిఫెన్స్ సిబ్బందికి వివిధ పోలీసు పతకాలను ప్రకటించారు.
దేశవ్యాప్తంగా మొత్తం 1037 మందికి వివిధ క్యాటగిరీల్లో పథకాలు లభించాయి. గ్యాలంట్రీ అవార్డుల్లో అత్యున్నతమైన రాష్ట్రపతి శౌర్య పథకం ఈసారి యాదయ్య ఒక్కరికే లభించటం విశేషం. యాదయ్యకు రాష్ర్టపతి గ్యాలంట్రీ మెడల్ రావడంపై రాష్ర్ట డీజీపీ జితేందర్ హర్షం వ్యక్తం చేశారు. యాదయ్యను ఘనంగా సన్మానించారు. తెలంగాణ పోలీసు శాఖకు యాదయ్య సాధించిన అవార్డు గర్వకారణమని కొనియాడారు.
తెలంగాణకు 29 పతకాలు
ఈ ఏడాది మొత్తం 1037 మందికి పతకాలు ప్రదానం చేయనున్నారు. ఇందులో 208 మందికి పోలీస్ మెడల్స్ ఫర్ గ్యాలంట్రీ, 75 మందికి రాష్ర్టపతి విశిష్ఠ సేవా పతకాలు, 624 మందికి పోలీసు విశిష్ఠ సేవా (మెడల్ ఫర్ మెరిటోరియస్ సర్వీస్) పతకాలను అందజేయను న్నారు. ఈ పురస్కారాల్లో రాష్ట్రం నుంచి 29 మందికి పతకాలు లభించాయి. ఒకరికి రాష్ర్టపతి గ్యాలం ట్రీ పతకం, ఏడుగురికి మెడల్ ఫర్ గ్యాలంట్రీ, ముగ్గురికి రాష్ర్టపతి విశిష్ఠ సేవా పతకం, 18 మందికి పోలీసు విశిష్ఠ సేవా పతకాలు లభించాయి.
కత్తిపోట్లకు గురైనా పోరాటం ఆపలేదు
తెలంగాణ పోలీసు శాఖలో పనిచేస్తున్న హెడ్ కానిస్టేబుల్ చదువు యాద య్య పరాక్రమానికి తగిన గుర్తింపు లభించింది. 2022లో అత్యంత సాహసోపే తంగా వ్యవహరించి దొంగలను పట్టుకున్నారు. గొలుసు చోరీలు, ఆయుధాల డీలింగ్‌కు పాల్పడుతున్న ఇద్దరు దుండగులు ఇషాన్ నిరంజన్, రాహుల్‌ను నిర్బంధించారు. 2022 జూలై 25న దొంగతనానికి పాల్పడుతుండగా యాద య్య వీరిని అడ్డుకున్నారు. ఈ క్రమంలో దుండగులు ఆయనపై విచక్షణారహితంగా కత్తితో దాడి చేసి ఛాతీ పైభాగాన పలుమార్లు పొడిచారు. తీవ్ర రక్తస్రావం అయి నా యాదయ్య వారిని వదిలిపెట్టలేదు. గాయాలతోనే వారిని నిర్బంధించారు. తీవ్ర గాయాల కారణంగా ౧౭ రోజులు ఆయన ఆసుప త్రిలో చికిత్స పొందారు.