calender_icon.png 5 January, 2025 | 8:43 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

‘మహాకుంభ్’కు రాష్ట్రపతికి ఆహ్వానం

31-12-2024 02:24:12 AM

లక్నో, డిసెంబర్ 30: ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జనవరి 13 నుంచి ‘మహాకుంభ్ మేళా’ ప్రారం భం కానున్నది. ఈ నేపథ్యంలో సీ ఎం యోగి ఆదిత్యనాథ్ న్యూఢిల్లీకి చేరుకుని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ను మర్యాదపూర్వకంగా కలిశారు. కుంభమేళాకు సంబంధించిన ఆహ్వానపత్రిక అందించారు.

అనంతరం ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్, కేం ద్ర హోం మంత్రి అమిత్‌షా, రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్, ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్‌కుమార్ సక్సేనాను కుంభమేళాకు ఆ హ్వానించారు.

జనవరి 13 కుంభమే ళా ప్రారంభమై ఫిబ్రవరి 26 వరకు కొనసాగనున్నది. దేశ విదేశాల నుంచి వచ్చే భక్తులకు సకల వసతు లు కల్పించేందుకు యూపీ ప్రభు త్వం ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నది. సీఎం యోగి ఆదిత్యనాథ్‌తో పాటు క్యాబినెట్ మంత్రులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.