calender_icon.png 26 November, 2024 | 3:19 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సమాజానికి రాజ్యాంగం మూలస్తంభం వంటిది : రాష్ట్రపతి

26-11-2024 12:28:25 PM

న్యూఢిల్లీ,(విజయక్రాంతి): పార్లమెంట్ సెంట్రల్ హాల్ లో 75వ భారత రాజ్యాంగ దినోత్సవ వేడుకలు జరిగాయి. రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా, లోక్ సభ, రాజ్యసభ సభ్యులు పాల్గొన్నారు.  రాజ్యాంగం ఆమోదం పొంది 75 ఏళ్లు పూర్తి అయిన సందర్భంగా హమారా సంవిధాన్‌, హమారా స్వాభిమాన్‌ పేరుతో వేడుకలను నిర్వహించారు. రాజ్యంగ వజ్రోత్సవాల సందర్భంగా రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధాని, స్వీకర్, రాహుల్‌ గాంధీ, ఖర్గే రాజ్యాంగ 75వ వేడుకలకు సంబంధించిన ప్రత్యేక పోస్టల్‌ స్టాంప్‌, జ్ఞాపకార్థం నాణెం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపదీ ముర్మ మాట్లాడుతూ... దేశ ప్రజలందరికీ రాజ్యాంగ వజ్రోత్సవాల శుభాకాంక్షలు తెలియజేశారు.

రాజ్యాంగం భారతదేశ పవిత్ర గ్రంథం అని, ఈ చరిత్రాత్మక ఘటనలో దేశ పౌరులు భాగస్వామ్యం అవుతున్నారని ఆమె పేర్కొన్నారు. 75 ఏళ్ల క్రితం ఇదే రోజున రాజ్యాంగం ఆమోదం పొంది ప్రజాస్వామ్య, గణతంత్ర ఆధారంగా రాజ్యాంగం రూపకల్పన జరిగిందన్నారు. భారత రాజ్యాంగానికి రాజేంద్రప్రసాద్, అంబేద్కర్ మార్గనిర్దేశం చేసి ప్రగతిశీల సూత్రాల గురించి గంథ్రంలో పొందుపరిచారని పేర్కొన్నారు.  సమాజానికి రాజ్యాంగం మూలస్తంభం వంటిదని, రాజ్యాంగ రచనలో భాగస్వామ్యులను స్మరించుకోవాలని రాష్ట్రపతి సూచించారు. రాజ్యాంగ నిర్మాణంలో బీ.ఎన్.రావు కీలక భూమిక పోషించారని, 75 ఏళ్ల స్వాతంత్ర్య భారతంలో అమృత్ మహోత్సవాలు నిర్వహించుకున్నామన్నారు. దేశ లక్ష్యాల సాధనలో అందరం ఐక్యంగా ఉన్నామనే భావన చాటాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సూచించారు.