calender_icon.png 31 January, 2025 | 2:15 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించిన రాష్ట్రపతి

31-01-2025 12:03:12 PM

న్యూఢిల్లీ,(విజయక్రాంతి): పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. పార్లమెంటు ఉభయసభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము(President Droupadi Murmu) ప్రసంగించారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి ముర్ము మాట్లాడుతూ.. కుంభమేళాలో జరిగిన తొక్కొసలాట బాధితులకు సంతపం తెలిపిన రాష్ట్రపతి స్వర్గీయులు మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ కు నివాళులర్పించారు. ఇటీవలే గణతంత్ర వేడుకలు ఘనంగా నిర్వహించుకున్నామని, ఉత్తర్ ప్రదేశ్ లోని ప్రయాగ్ రాజ్ లో మహాకుంభమేళా జరుగుతున్న సమయంలో పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు నిర్వహించుకోవడం సంతోషంగా ఉందన్నారు. బడ్జెట్ లో రైతులు, మహిళలు, పేదలు, యువతకు ప్రాధాన్యత ఉందని, కేంద్ర ప్రభుత్వం పేదరిక నిర్మూలన కోసం అనేక పథకాలు అమలు చేస్తుందని రాష్ట్రపతి తెలిపారు. పీఎం ఆవాస్ యోజన ద్వారా లక్షల ఇళ్లు నిర్మించి ఇస్తున్నామని, అమృత్ భారత్, నమో భారత్ రైళ్లు ప్రవేశపెడుతున్నట్లు ముర్ము పేర్కొన్నారు. ప్రభుత్వం మూడు రెట్ల వేగంతో పని చేస్తోందని రాష్ట్రపతి ముర్ము చెప్పారు. త్వరలో ప్రపంచంలో మూడో ఆర్థిక వ్యవస్థగా భారత్ మరనుందని అభిప్రాయపడ్డారు.

విద్యారంగంపై, పేదలు గౌరవంతో జీవించేలా ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారిస్తోందన్నారు. ఒకే దేశం ఒకే పింఛన్, వక్ఫ్ సంస్కరణలు తీసుకువస్తున్నామని, ప్రభుత్వ సంక్షేమ పథకాలు పేదలకు లబ్ధి చేకూర్చుతున్నాయని రాష్ట్రతి స్పష్టం చేశారు. ప్రభుత్వం తీసుకోస్తున్న కొత్త పథకాలు వేగవంతంగా అమలు చేస్తున్నామన్నారు. 70 ఏళ్లు దాటిన 6 కోట్ల మందికి ఆయుష్మాన్ భారత్ ద్వారా ఆరోగ్య బీమా, పీఎం ఆవాస్ యోజన్ ద్వారా మరో 3 కోట్ల కుటుంబాలకు ఇళ్లు అందిస్తామని చెప్పారు. చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్లు కల్పిస్తూ మహిళలు వేగంగా సాధికారత సాధించే దిశగా చర్యలు తీసుకుంటున్నామని, దేశంలో కార్పొరేట్ సంస్థలకు నాయకత్వం వహిస్తున్న మహిళలు ఒలింపిక్ పతకాలు సాధిస్తూ దేశం గర్వించేలా చేస్తున్నారని రాష్ట్రపతి హర్షం వ్యక్తం చేశారు. యువతకు ఉద్యోగాల కల్పనపై ప్రత్యేక దృష్టి సారించినట్లు ఆమె వెల్లడించారు. 25 కోట్ల మంది పేదలను దారిద్యం నుంచి బయటకు తెచ్చామన్నారు. ఎన్ఆర్ఎల్ఎం ద్వారా 91 లక్షల స్వయం సహాయక బృందాలకు సాధికారత అందుతుంది. స్టార్టప్ లు, క్రీడలు, అంతరిక్ష రంగాల్లో యువత దేశానికి వన్నె తెస్తోందని, మారుమూల ప్రాంతాల్లో డిజిటల్ సేవల కల్పనలో మహిళలు కీలకపాత్ర పోషిస్తున్నారు. నూతన విద్య విధానంతో ఆధునిక విద్య వ్యవస్థ ఏర్పాటు చేశామని, మానవ సహిత అంతరిక్ష యాత్రలు చేసే రోజు ఎంతో దూరంలో లేదన్నారు.