27-02-2025 01:04:31 AM
5 మిలియన్ డాలర్లకు అమెరికా పౌరసత్వం!
కొత్త పథకాన్ని ప్రకటించిన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్
అమెరికా వలస విధానంలో పెనుమార్పులకు అవకాశం
భారతీయ మధ్యతరగతి నిపుణుల్లో ఆందోళన
వాషింగ్టన్, ఫిబ్రవరి 26: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 5 మిలియన్ల అమెరిక న్ డాలర్ల (రూ.43.54కోట్ల్లు) భారీ రుసుం తో ఆ దేశ పౌరసత్వం తీసుకోవడానికి ‘గోల్డ్ కార్డ్’ వీసాను బుధవారం ప్రకటించారు. సం పన్న పెట్టుబడిదారులను ఆకర్షించడం ద్వారా మూలధనాన్ని సేకరించాలనే వ్యూ హంతో దీన్ని ప్రవేశపెట్టారు. వలసదారులు 5 మిలియన్ డాలర్లు వెచ్చించగలిగితే చాలు అమెరికా పౌరసత్వాన్ని కొనుగోలు చేసినట్టే. ఈక్రమంలో ఇప్పటివరకు అమల్లో ఉన్న ఈబీ ప్రోగ్రామ్ కనుమరుగు కానుంది. గోల్డ్‌కార్డు వీసా ఏప్రిల్ నుంచి అమల్లోకి వచ్చే అవకాశం ఉంది.
గోల్డ్ కార్డు వీసా, ఈబీరా మధ్య తేడా..
5 మిలియన్ డాలర్లు భరించగలిగితే నేరుగా గోల్డ్‌కార్డు ద్వారా అమెరికా పౌరసత్వం వస్తుంది. గతంలోని ఈబీ వీసా ప్రకారం.. 8 లక్షల డాలర్ల నుంచి 10.5 లక్షల డాలర్లు (దాదాపు రూ.6.9 కోట్ల నుంచి 9 కోట్లవరకు) పెట్టుబడి పెట్టి 10 ఉద్యోగాలు సృష్టించాలి. దీన్ని 1990లో ప్రవేశపెట్టారు. తాజాగా ప్రతిపాదించిన గోల్డ్ కార్డ్ సంపన్నులకు మేలు చేసేలా ఉంది. దీనిలో ఉద్యోగ సృష్టి వంటి అంశాలు లేవు. ఈబీ పోలి స్తే గోల్డ్ కార్డు వీసాకు వెచ్చించాల్సిన మొ త్తం 5 రెట్లు ఎక్కువ. ఇది చిన్న, మధ్యతరగతి పెట్టుబడిదారులు భరించలేరు.
ట్రంప్ ఏం చెబుతున్నారు..
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ లెక్కల ప్రకా రం.. దాదాపు 10 లక్షల గోల్డ్ కార్డులు విక్రయించవచ్చని తెలుస్తోంది. కోటి గోల్డ్ కార్డు లు విక్రయిస్తే అమెరికా ద్రవ్యలోటు తగ్గుతుందని డొనాల్డ్ ట్రంప్ అభిప్రాయపడ్డారు. “ఈ కార్డు కొనడం ద్వారా ధనవంతులు అమెరికాకు వస్తారు. వారు ధనవంతులు అవుతారు.. వారు విజయం సాధించి చాలా డబ్బు ఖర్చు చేస్తారు.. భారీగా పన్నులు చెల్లిస్తారు. చాలా మందికి ఉపాధి కల్పిస్తారు” అని ట్రంప్ చెప్పుకొచ్చారు.
భారతీయులపై ప్రభావమెంత?
అమెరికా గ్రీన్‌కార్డు దరఖాస్తుదారుల జాబితాలో భారతీయులు అత్యధికంగా ఉన్నారు. 5మిలియన్ డాలర్ల ధర అంటే అత్యంత ధనవంతులు, వ్యాపార దిగ్గజా లు మాత్రమే గోల్డ్‌కార్డ్ వీసాను కొనగలుగుతారు. నైపుణ్యం కలిగిన మధ్య తరగతి నిపుణులకు గోల్డ్‌కార్డును కొనడం కష్టం కానుంది. అంతేకాకుండా ఈబీ కింద దరఖాస్తుదారులు రుణాలు లేదా ఫూల్ ఫండ్‌ను తీసుకోవచ్చు. కానీ గోల్డ్‌కార్డ్ వీసాకు ముందుగానే నగదు చెల్లించాలి.. ఇది భారతీయుల్లో ఎక్కువ మంది ఇబ్బందిని కలిగించేదే.