06-04-2025 12:34:13 AM
చట్టంగా మారిన వక్ఫ్ సవరణ బిల్లు
న్యూఢిల్లీ, ఏప్రిల్ 5: లోక్‌సభ, రాజ్యసభలలో సుదీర్ఘ చర్చ అనంతరం ఆమోదం పొందిన వక్ఫ్ సవరణ బిల్లు శనివారం రాష్ట్రపతి ఆమోద ముద్ర వేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోద ముద్ర వేయడంతో వక్ఫ్ సవరణ బిల్లు చట్టంగా మారింది. పార్లమెంట్‌కు వచ్చిన వక్ఫ్ సవరణ బిల్లుపై సుదీర్ఘ చర్చ అనంతరం బుధవారం లోక్‌సభలో, గురువారం రాజ్య సభలో ఆమోదముద్ర పడింది. ఉభయ సభల్లో చర్చ సందర్భంగా ఈ బి ల్లును ప్రతిపక్షాలు ముక్తకంఠంతో వ్యతిరేకించాయి. కొంత మంది నేతలు ఈ బిల్లును వ్యతిరేకిస్తూ సుప్రీం కోర్టును కూడా ఆశ్రయించారు. దేశవ్యాప్తంగా అనేక చోట్ల నిరసలు కూడా వెల్లువెత్తుతున్నాయి.