13-02-2025 06:03:14 PM
నిర్మల్ (విజయక్రాంతి): తెలంగాణ ప్రాంతం అంటేనే సంస్కృతి సంప్రదాయాలకు నిలయమని కవులు కళాకారులు ఉన్న ఈ చరిత్రను సమాజానికి అందించాలని ఉద్దేశంతోనే కళారూపాల ద్వారా ప్రదర్శన ఇస్తున్నట్టు తెలంగాణ సాంస్కృతిక కళాకారుల సంస్థ రాష్ట్ర కన్వీనర్ పాటల రాజేశ్వరి అన్నారు. నిర్మల్ ప్రెస్ క్లబ్ లో గురువారం ఆమె మాట్లాడారు. అన్ని జిల్లాల్లో సాంస్కృతిక సారధి జిల్లా కమిటీలను ఏర్పాటు చేసి తెలంగాణ కళాకారులను ఏకం చేసి ఐక్యత ఉద్యమాల సాధనకు హక్కుల కోసం పోరాడుతామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు మహేష్ మమత దిగంబర్ రాజేందర్ రాము సతీష్ తదితరులు పాల్గొన్నారు.