calender_icon.png 15 January, 2025 | 8:36 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సిరీస్ సమర్పయామి

08-08-2024 02:03:49 AM

మూడో వన్డేలో భారత్ పరాజయం

కొలంబొ: శ్రీలంకతో జరిగిన వన్డే సిరీస్‌ను టీమిండియా 0-2తో ఆతిథ్య జట్టుకు కోల్పోయింది. బ్యాటింగ్ వైఫల్యం భారత్‌ను ముంచగా.. లంక 27 సంవత్సరాల తర్వాత ద్వైపాక్షిక వన్డే సిరీస్‌ను కైవసం చేసుకొని చరిత్ర సృష్టించింది. తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 248 పరుగులు చేసింది. ఓపెనర్ అవిష్క ఫెర్నాండో (102 బంతుల్లో 96) తృటిలో శతకం కోల్పోయాడు. కుషాల్ మెండిస్ (59) అర్థసెంచరీతో రాణించాడు. భారత బౌలర్లలో పరాగ్ 3 వికెట్లు పడగొట్టాడు. అనంతరం లక్ష్య ఛేదనలో భారత్ 26.1 ఓవర్లలో 138 పరుగులకే కుప్పకూలింది. కెప్టెన్ రోహిత్ (35) మినహా మిగతావారంతా దా రుణంగా విఫలమయ్యారు. ఆఖర్లో సుందర్ 30 పరుగులు చేయడంతో భారత్ వంద పరుగులైనా దాటగలిగింది. లంక బౌలర్లలో వెల్లలాగే 5 వికెట్లతో రాణించాడు. ఫెర్నాం డో ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’, వెల్లలాగే ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’ కైవసం చేసుకున్నారు.