calender_icon.png 10 April, 2025 | 12:37 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గీతంలో ఏస్-2025 అవార్డుల ప్రదానం

05-04-2025 07:08:35 PM

పటాన్ చెరు: హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలోని డైరెక్టరేట్ ఆఫ్ స్టూడెంట్ లైఫ్ శనివారం ప్రతిష్టాత్మక ఏస్-2025 అవార్డుల ప్రదానోత్సవాన్ని సగర్వంగా నిర్వహించింది. పాఠ్యేతర కార్యకలాపాలు, క్రీడలు, సమాజ సేవ, నాయకత్వంలో అసాధారణ ప్రతిభ చూపిన విద్యార్థులను సత్కరించింది. వారితో పాటు ఉత్తమ సహాయ సిబ్బంది, ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు, ఎన్ సీసీ క్యాడెట్ల అమూల్యమైన సహకారాన్ని కూడా గుర్తించి, వారిని కూడా సముచిత రీతిలో సత్కరించి, ఉత్సాహపరిచింది.

బహుళ విభాగాలలోని విద్యార్థుల విభిన్న ప్రతిభ, అత్యుత్తమ ప్రదర్శనలను ప్రశంసిస్తూ మొత్తం 52 అవార్డులను గీతం రెసిడెంట్ డైరెక్టర్ డీవీవీఎస్ఆర్ వర్మ, ఆతిథ్య విభాగం-స్టూడెంట్ లైఫ్ డైరెక్టర్ అంబికా ఫిలిప్ ప్రదానం చేశారు. విద్యతో పాటు సమగ్రాభివృద్ధిని ప్రోత్సహించడంలో గీతం నిబద్ధతకు ఈ కార్యక్రమం ఓ నిదర్శనంగా నిలిచిందని గీతం ప్రతినిధులు అభిప్రాయపడ్డారు.