10 June, 2026 | 2:45 AM

తొలకరికి ముందే.. సాగుకు సన్నద్ధం

10-06-2026 01:30 AM

వ్యవసాయ పనుల్లో అన్నదాతల నిమగ్నం

మహబూబాబాద్, జూన్ 9 (విజయక్రాంతి): తొలకరి వర్షాలకు ముందే ఉమ్మడి వరంగల్ జిల్లాలో రైతులు వ్యవసాయ పను లు ప్రారంభించారు. కొన్ని ప్రాంతాల్లో దు క్కులు దున్నే పనిలో నిమగ్నమయ్యారు. మ రి కొన్ని చోట్ల పొడి దుక్కుల్లో విత్తనాలు వేసే కార్యక్రమాలను ప్రారంభించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో గత వారంలో కురిసిన  అడపాదడపా వర్షాలతో భూములను దుక్కి చేసి, పత్తి విత్తనం వేయడానికి అనువుగా ’అచ్చు’ చేస్తున్నారు. రోహిణి కాలంలో విత్తనం వేస్తే మంచి పంట పండుతుందనే సంప్రదాయాన్ని కొనసాగించేందు కు ముందుకు సాగుతున్నారు. మంగళవా రం జిల్లాలో పలుచోట్ల వర్షాలు కురవడంతో పొడి దుక్కి లోనే పత్తి విత్తనాలను వేస్తున్నారు.