calender_icon.png 27 November, 2024 | 10:26 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వరంగల్ మాస్టర్ ప్లాన్ సిద్ధం

06-11-2024 01:51:28 AM

2050- విజన్

  1. యుద్ధప్రాతిపదికన మామునూరు ఎయిర్‌పోర్ట్ పనులు 
  2. ఈ నెలలో కాళోజీ కళాక్షేత్రం ప్రారంభం
  3. వరంగల్ అభివృద్ధ్దిపై మంత్రులు పొంగులేటి, పొన్నం, సురేఖ సమీక్ష

హైదరాబాద్, నవంబర్ 5 (విజయక్రాంతి) : గొప్ప చారిత్రక నేపథ్యం ఉన్న వరంగల్ నగర అభివృద్ధ్దికి, భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా 2050 జనాభాను దృష్టిలో పెట్టుకొని రూపొందించిన మాస్టర్ ప్లాన్ తుది దశకు చేరుకుందని త్వరలో సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా మాస్టర్ ప్లాన్‌ను విడుదల చేస్తారని రెవెన్యూ, హౌసిం గ్, సమాచార పౌరసంబంధాలు, వరంగల్ జిల్లా ఇన్‌చార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు.

మంగళవారం హైదరాబాద్ లోని ఎంసీహెచ్‌ఆర్డీలో వరంగల్, హనుమకొండ జిల్లాల అభివృద్ధి కార్యక్రమాలపై దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ఆయా జిల్లాల  ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి సమీక్షా సమావేశం నిర్వ హించారు.

ఈ సమావేశంలో నూతన మాస్టర్ ప్లాన్, వరంగల్ ఇన్నర్ రింగ్ రోడ్, ఔటర్ రింగ్ రోడ్, భద్రకాళి టెంపుల్ అభివృద్ధ్ది, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, మెగా టెక్స్ టైల్ పార్క్, మామునూరు ఎయిర్‌పోర్ట్, ఎకో టూరిజం తదితర అంశాలపై ప్రధానంగా చర్చించారు. 

హైదరాబాద్‌తో సరితూగేలా...

హైదరాబాద్‌తో సరితూగేలా వరంగల్ నగరాన్ని అభివృద్ధి పరచాలన్న కృతనిశ్చయంతో ఉన్నామని మంత్రి పొంగులేటి తెలిపారు. ఈ అంశంపై సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారన్నారు. ఎన్నో ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న వరంగల్ మాస్టర్ ప్లాన్‌ను  తమ ప్రభుత్వం కొలిక్కి తీసుకువచ్చిందన్నారు. అభివృద్ధి పనుల వేగం పెంచాల ని అధికారులను ఆదేశించారు.

ఇన్నర్ రింగ్ రోడ్, ఔటర్ రింగ్ రోడ్‌కు అవసరమైన భూసేకరణను యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలని అధికా రులను ఆదేశించారు. 41 కి.మీ పరిధి ఉన్న వరంగల్ ఔటర్ రింగ్ రోడ్డును మూడు దశల్లో చేపట్టాలని మొదటి దశలో 20 కి.మీ, రెండో దశలో 11 కి.మీ, మూడో దశలో 9 కి.మీ చేపట్టాలని సమావేశంలో నిర్ణయించారు.

హైదరాబాద్ మినహా రాష్ర్టంలో మరెక్కడా ఎయిర్‌పోర్ట్ లేదని, వరంగల్ జిల్లాలో ఎయిర్ పోర్ట్ రాబోతోందన్నారు. వీలైనంత త్వరగా ఎయిర్‌పోర్ట్ పనులను ప్రారంభించి ఏడాదిలోపు  ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడానికి అవసరమైన కార్యాచరణను రూపొందించాలని అధికా రులను ఆదేశించారు.

382 ఎకరాల పరిధిలో ఉన్న చారిత్రాత్మకమైన భద్రకాళి చెరువులో పేరుకుపోయిన పూడికను తీయాలని, ఇందుకు సంబంధించిన పనులను రేపటినుంచే మొదలు పెట్టాలన్నారు. ప్రజలకు ఇబ్బంది లేకుండ చెరువును ఖాళీ చేయాలని అధికారులకు సూచించా రు.

ఈ చెరువు 40 శాతం గుర్రపు డెక్కతో నిండిపోయిందన్నారు. మెగా టెక్స్ టైల్ పార్క్ లో కంపెనీలు స్థ్దానికులకు ఉద్యోగ అవకాశాలు కల్పించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. నగరంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పనులను ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలన్నారు.

కల నెరవేరనుంది : మంత్రి కొండా సురేఖ

మామునూరు ఎయిర్‌పోర్ట్ కల త్వరలోనే సాకారం కానుందని మంత్రి కొండా సురేఖ తెలిపారు. జీఎంఆర్ ఎయిర్‌పోర్ట్స్ లిమిటెడ్ మామునూరు విమానాశ్రయం ఏర్పాటుకు అంగీకరించినట్లు చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డితో చర్చించి త్వరలోనే మామునూరు ఎయిర్‌పోర్ట్ కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేస్తామని అన్నారు.

సీఎం రేవంత్ రెడ్డి చేతులమీదుగా ఈ నెలలో కాళోజీ కళాక్షేత్రాన్ని ప్రారంభిస్తామని మంత్రి తెలిపారు. సమావేశంలో ఎంపీ కడియం కావ్య, ఎమ్మెల్యేలు కడి యం శ్రీహరి, రేవూరి ప్రకాశ్‌రెడ్డి, కే నాగరాజు, నాయిని రాజేందర్, ఎమ్మెల్సీ బస్వ రాజు సారయ్య, వరంగల్ మేయర్ గుండు సుధారాణి, సీఎం సలహాదారు వేం నరేందర్‌రెడ్డి, సీఎం ప్రత్యేక కార్యదర్శి బీ అజిత్ రెడ్డి, ప్రిన్సిపల్ సెక్రటరీ దాన కిశోర్, రోడ్లు, భవనాల కార్యదర్శి దాసరి హరిచందన, హనుమకొండ, వరంగల్ జిల్లా కలెక్టర్లు సత్యశారద, పీ ప్రావీణ్య తదితరులు పాల్గొన్నారు.