calender_icon.png 16 January, 2025 | 10:54 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి సిద్ధం

05-09-2024 01:26:14 AM

సంఘాల నేతలతో డిప్యూటీ సీఎం భట్టి

హైదరాబాద్, సెప్టెంబర్ 4 (విజయక్రాంతి): ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. బుధవారం బాబా సాహెబ్ అంబేద్కర్ తెలంగాణ ఎంప్లాయీస్ జాయింట్ యాక్షన్ కమిటీ (టీజీఈజేఏసీ) సభ్యులు సచివాలయంలో డిప్యూటీ సీఎంను కలిసి తమ సమస్యలను విన్నవించారు. ఉద్యోగులకు పెండింగ్‌లో ఉన్న నాలుగు డీఏల విడుదల సహా 39 డిమాండ్లను నెరవేర్చాలని నాయకులు కోరారు. జేఏసీ నాయకుల డిమాండ్ల పట్ల డిప్యూటీ సీఎం స్పందిస్తూ  ఉద్యోగుల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం సానుకూలంగా ఉంటుందని స్పష్టం చేశారు. సమస్యల పరిష్కారానికి ఉద్యోగులతో ప్రభుత్వం ఎన్నిసార్లునా చర్చించేందుకు సిద్ధంగా ఉందన్నారు. డిప్యూటీ సీఎంను కలిసిన వారిలో టీజీఈజేఏసీ చైర్మన్ మారం జగదీశ్వర్, తెలంగాణ జేఏసీ స్టీరింగ్ కమిటీ మెంబర్ దేవరకొండ సైదులు తదితరులు ఉన్నారు.