- రైతులేమైనా సంఘ విద్రోహ శక్తులా?
- మీడియాతో ఎంపీ ఈటల రాజేందర్
హైదరాబాద్, నవంబర్ 19 (విజయక్రాంతి) : కాంగ్రెస్ సర్కారు అన్ని రంగాల్లో విఫలమైందని ఎంపీ ఈటల రాజేందర్ పేర్కొన్నారు. మంగళవారం బీజేపీ రాష్ర్ట కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రేవం త్ అమలు చేశామని చెప్తున్న హామీల అమలుపై చర్చకు ప్రధాని అవసరం లేదని.. తా ను సిద్ధమని ఈటల సవాల్ విసిరారు.
రాష్ట్రంలో ప్రభుత్వం చేస్తున్న ఏడాది సంబురాలను చూసి జనం నవ్వుకుంటున్నారని ఎ ద్దేవా చేశారు. రంగారెడ్డి జిల్లా ముచ్చర్లలో గతంలో ఫార్మాసిటీ కోసం హెలికాప్టర్లతో సర్వే చేయించి 14 వేల ఎకరాలు సేకరించారని, ఇంకా 5 వేల ఎకరా ల భూమిని సేక రిస్తున్నారని తెలిపారు.
ముచ్చర్లలో భూసేకరణకు వచ్చే వారిని తరిమికొట్టాలని ప్రతి పక్షంలో ఉన్నప్పుడు రేవంతేపిలుపునిచ్చారని, ఫార్మాసిటీని రద్దు చేస్తామన్న కాం గ్రెస్.. కొడంగల్‌లో భూ సేకరణ కోసం బెదిరింపులకు పాల్పడుతోందనారు.
ప్రజలు వ్యతిరేకించినా కలెక్టర్ వెళ్లారు
ప్రజలు వ్యతిరేకించినా కలెక్టర్ ప్రజాభిప్రాయ సేకరణకు వెళ్లారని.. అందుకే వాళ్లు తిరిగి పంపారని ఈటల గుర్తు చేశారు. కలెక్టరే తనపై దాడి జరగలేదని ప్రకటింటినా.. వందలాది మందిపై పోలీసులు దాడి చేయడాన్ని చూసి యావత్ సమాజం కన్నీళ్లు పెడుతున్నదన్నారు.
జడ్చర్ల పోలేపల్లిలో భూములు కోల్పోయిన రైతులు పెద్ద ఉద్యోగాల్లో లేరని.. టాయిలెట్లు కడుగుతూ, లిఫ్ట్ బాయ్‌లు, అటెండర్లుగా పనిచేస్తున్నారని తెలిపారు. పోలీసులు థర్డ్ డిగ్రీ ప్రయోగించేందుకు రైతులేమీ సంఘ వ్యతిరేక శక్తులు కాదన్నారు. మూసీకి ఇరువైపులా ఉన్న విలువైన భూములను లాక్కొని.. మల్టీ నేషనల్ కంపెనీలకు ఇచ్చి రియల్ ఎస్టేట్ చేయాలని చూస్తున్నారని ఆరోపించారు.