ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు
కుమ్రం భీం ఆసిఫాబాద్(విజయక్రాంతి): ఏడాది పాలనలో నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధి శూన్యమని నిరూపించేందుకు చర్చకు సిద్ధంగా ఉన్నట్లు ఎమ్మెల్యే పాల్వయ్య హరీష్ బాబు కాంగ్రెస్ నాయకులకు సవాల్ విసిరారు. శుక్రవారం కాగజ్ నగర్ లోనీ తన నివాసంలో నాయకులతో కలిసి ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలో ఒక రూపాయి కూడా అభివృద్ధి కేటాయించలేదని గ్రామాలలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు కేంద్ర ప్రభుత్వ నిధుల ద్వారా జరుగుతున్నట్లు వివరించారు.
నియోజకవర్గంలో తనను తిరగనివ్వమని ఎమ్మెల్సీ దండే విటల్ పేర్కొనడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఎమ్మెల్యేగా ప్రజలు నన్ను ఓట్లు వేసి ఎన్నుకున్నారని గ్రామాల్లో తిరగనివ్వం అని వారి హెచ్చరికలకు భయపడేదే లేదని. చూస్తూ ఊరుకునే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. జిల్లాకు చెందిన విద్యార్థిని ఫుడ్ పాయిజన్ తో మృతి చెందితే ఇప్పటివరకు జిల్లా ఇన్చార్జ్ గా ఉన్న మంత్రి సీతక్క కుటుంబ సభ్యులను పరామర్శించలేదని మంత్రి వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అభివృద్ధిపై చర్చకు స్థలము ,తేదీ కాంగ్రెస్ నాయకులే నిర్ణయించాలన్నారు.ఈ సమావేశంలో బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కోంగ సత్యనారాయణ, జిల్లా ప్రధాన కార్యదర్శి ధోని శ్రీశైలం ,మాజీ ఎంపీపీ కొప్పుల శంకర్, నాయకులు రాజన్న, దుర్గం కారు తదితరులు పాల్గొన్నారు.