నిత్యామీనన్ జాతీయ ఉత్తమ నటిగా అవార్డు గెలుచుకుని మంచి జోష్ మీదుంది. ఇండస్ట్రీకి వచ్చి ఏళ్లకేళ్లు గడుస్తున్నా కూడా అమ్మడు పెద్దగా గ్లామర్ షోల జోలికి వెళ్లలేదు. నిత్య ఖాతాలో మంచి హిట్ చిత్రాలే ఉన్నాయి. తెలుగులోనే కాదు.. కన్నడ, మలయాళం, హిందీ వంటి భాషల్లో నటించి అన్ని పరిశ్రమల్లోనూ మంచి గుర్తింపు తెచ్చుకుంది.
నిత్యామీనన్ ప్రస్తుతం హీరో ధనుష్‌తో జత కట్టేందుకు సిద్ధమైంది. గతంలో వీరిద్దరి కాంబోలో వచ్చిన తిరు చిత్రం అమ్మడికి మంచి పేరు మాత్రమే కాదు.. ఉత్తమ నటిగా జాతీయ అవార్డును తెచ్చి పెట్టింది. తాజాగా నిత్య “కొత్త ప్రకటన.. కొత్త ప్రయాణం.. ఇడ్లీ కడై” అనే పోస్ట్‌తో సామాజిక మాధ్యమాల్లో ఒక ఫోటోను పంచుకున్నారు.
మొత్తానికి అమ్మడు ‘ఇడ్లీ కొట్టు’ను ప్రారంభించేశారు. మరో విశేషం ఏంటంటే ఈ చిత్రానికి ధనుష్ కథానాయకుడు మాత్రమే కాకుండా దర్శకుడు కూడా కావడం గమనార్హం. విలేజ్ బ్యాక్ డ్రాప్‌లో ఈ చిత్రం రూపొందనుంది. డాన్ పిక్చర్స్ సంస్థ ఈ సినిమాను నిర్మిస్తోంది. ప్రకాశ్ రాజ్, షాలినీ పాండే కీలక పాత్రలు పోషిస్తున్నారు.