calender_icon.png 15 January, 2025 | 7:38 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వరంగల్ నగరాభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేయండి

25-08-2024 02:51:03 AM

రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

హైదరాబాద్, ఆగస్టు 24 (విజయక్రాంతి): వరంగల్ నగరాభివృద్ధికి మాస్టర్ ప్లాన్‌ను సిద్ధం చేయాలని జిల్లా ఇన్‌చార్జి మ ంత్రి, రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార పౌర సరఫరాల శాఖ మంత్రి పొంగు లేటి శ్రీనివాస్ రెడ్డి ఆదేశించారు. హైదరాబాద్‌లోని సచివాలయంలో శనివారం కాకతీయ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ(కుడా) అధికారులు, సంబంధిత శాఖల ఆఫీసర్లతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. వరంగల్ నగరం హైదరాబాద్ స్థాయికి వెళ్లేలా మాస్టర్ ప్లాన్ ఉండాలని సూచించారు.

గతంలో రూపొందించిన ప్లాన్ 2041 నాటి జనాభాను అంచనా వేసి రూపొందించారని, ఇప్పుడు కొత్తగా 2 050 నాటి జనాభా అంచనాలతో ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించారు. అందు కు అవసరమైన భూసేకరణ పనులను చేపట్టాలన్నారు. ఇప్పటివర కు కన్సల్టెంట్లు తయారు చేసిన ప్లాన్‌ను అధికారులు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా మంత్రికి వివరించారు. సమీక్షలో రాష్ట్ర మున్సిపల్ పరిపాలన ముఖ్య కార్యకార్యదర్శి దాన కిశోర్, రోడ్లు, భవనాల శాఖ ప్రత్యేక కార్యదర్శి హరిచందన, కుడా వైఎస్ చైర్మన్, కమిషనర్ అశ్విని, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డైరెక్టర్ గౌతమ్, కుడా సీపీవో అజిత్‌రెడ్డి పాల్గొన్నారు.