calender_icon.png 24 October, 2024 | 5:52 AM

మొక్కల పండుగకు సిద్ధం

09-07-2024 04:19:12 AM

  • వన మహోత్సవంలో ఈ ఏడాది గ్రేటర్‌లో 30 లక్షల మొక్కలు నాటడమే లక్ష్యం 
  • ఏడాది పాటు జీహెచ్‌ఎంసీ పర్యవేక్షణలోనే.. 
  • గత 8 ఏళ్లలో 7.71 కోట్ల మొక్కలు నాటించిన అధికారులు  
  • మనుగడలో 78 శాతం మొక్కలు 

హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 8 (విజయక్రాంతి): రాష్ట్రంలో అడవుల పెంపకం, పర్యావరణ పరిరక్షణకు వన మహోత్సవం పేరుతో ప్రభుత్వం బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. వన మహోత్సవంలో భాగంగా ప్రతి ఏడాది మొక్కలను నాటేందు కు ఆయా విభాగాల అధికారులకు ప్రభు త్వం లక్ష్యాన్ని నిర్ధేశించడమే కాకుండా, వాటి పరిరక్షణ చర్యలను కూడా అధికారులకు అప్పగించింది. దీంతో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం దగ్గరి నుంచి గ్రేటర్‌లో ప్రత్యేక కార్యాచరణతో ప్రతి ఏడాది మొక్కలు నాటే కార్యక్రమాన్ని జీహెచ్‌ఎంసీ చేపడుతోంది. ముఖ్యంగా ప్రభుత్వ విద్యా సంస్థలు, ప్రభు త్వ కార్యాలయాలు, ప్రధాన రహదారులు, పార్కులు, ఫ్లుఓవర్ల వద్ద, కాలనీలతో పాటు ఎక్క డ ఖాళీ స్థలం ఉంటే అక్కడ మొక్కలు నాటేందుకు ప్రత్యే క కార్యాచరణ చేపడుతూ, నాటిన మొక్కలను పెంచేందుకు ప్రత్యేక కసరత్తు చేస్తున్నారు. 

8 ఏళ్లలో 7.71 కోట్ల మొక్కలు.. 

జీహెచ్‌ఎంసీ వ్యాప్తంగా 6 జోన్లు, 30 సర్కిళ్ల పరిధిలోని 150 డివిజన్లలో గడిచిన 8 ఏళ్ల కాలంలో ప్రభుత్వం మొత్తం 8.41 కోట్ల మొక్కలను నాటాలని లక్ష్యంగా పెట్టుకుంది. బల్దియా అర్బన్ బయో డైవర్సిటీ విభాగం ఆధ్వర్యంలో మొత్తం 7 కోట్ల 71 లక్షల 6 వేల 944 మొక్కలను నాటారు. వీటిలో 4 కోట్ల 73 లక్షల 95 వేల 115 మొ క్కలను జీహెచ్‌ఎంసీ వివిధ కార్యక్రమాల ద్వారా నాటగా, 2 కోట్ల 97 లక్షల 11 వేల 879 మొక్కలను వివిధ బస్తీలు, కాలనీ అసోసియేషన్లు, ఎన్‌జీవోలు, ఇతర సంస్థలకు పంపిణీ చేశారు. మొ త్తం నాటిన 7.71 కోట్ల మొక్కలలో 91 శాతం పరిరక్షించాలని జీహెచ్‌ఎంసీ లక్ష్యంగా పెట్టుకోగా, 78 శాతం మొక్కలను పరిరక్షణ చేయగలిగింది. 

ఈ ఏడాది 30 లక్షల టార్గెట్..  

గ్రేటర్‌లో వనాలను పెంచడానికి దాదా పు 6 జోన్లవ్యాప్తంగా 600 వార్డు స్థాయి నర్సరీలను ఏర్పాటు చేసి మొక్కలను పెంచుతున్నారు. గత 8 సంవత్సరాలుగా గ్రేటర్ పరిధిలో ప్రతి ఏడాది 70 లక్షల నుంచి 80 లక్షల దాకా మొక్కలు నాటే కార్యక్రమాన్ని అధికారులు చేపట్టారు. అందులో భాగంగా 2016 85 లక్షలు, 2017 77 లక్షలు, 2018 43 లక్షలు, 2019 72 లక్షలు, 2020 2. 19 కోట్లు, 2021 1.23 కోట్లు, 20 22 77 లక్షలు, 2023 72 లక్షల మొక్కలను నాటినట్టుగా జీహెచ్‌ఎంసీ గణాంకాలు చెబుతున్నాయి. ఈ ఏడాది వన మహోత్సవంలో భాగంగా గ్రేటర్ వ్యాప్తంగా 60 లక్షల మొక్కలు అందుబాటులో ఉండ గా, 30.81 లక్షల మొక్కలను నాటేందుకు జీ హెచ్‌ఎంసీ నిర్ణయం తీసుకుంది. వీటిని గ్రేటర్‌లోని జోన్ల వారీగా ఇలా నాటనున్నారు. 

78 శాతం మొక్కలను కాపాడాం.. 

గత 8 సంవత్సరాలలో మొత్తం 8.41 కోట్ల టార్గెట్‌కు 7.71 కోట్ల మొక్కలను నాటాం. వీటిలో మొత్తం 91 శాతం మొక్కలను కాపాడేందుకు చర్యలు తీసుకున్నాం. కానీ 78 శాతం మొక్కలు మనుగడలో ఉన్నాయి. ముఖ్యంగా ఏడాది, రెండేళ్ల వయస్సు కలిగిన 5 అడుగులు, 6 అడుగులు కలిగిన మొక్కలను నాటుతున్నాం. అందువల్ల అత్యధిక శాతం మొక్కలు బతకడానికి అవకాశాలు ఉన్నాయి. అయితే, మొక్కలు నాటిన ఏడాది కాలం పాటు వాటి పర్యవేక్షణ జీహెచ్‌ఎంసీనే చూస్తుంది. వీటి సంరక్షణ కు జీహెచ్‌ఎంసీ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా కాంట్రాక్టర్ నియామకం చేసు కుంటున్నాం. ఆ కాంట్రాక్టర్ పనితీరుపై ఎప్పటికప్పుడు నిఘా, రిపోర్టు తీసుకోవడంతో పాటు తదితర పర్యవేక్షణ చేపడుతుంటాం. 

 సునంద, అడిషనల్ కమిషనర్, జీహెచ్‌ఎంసీ