- 2025-26 ఆర్థిక సంవత్సరానికి శాఖలవారీ సమావేశాలు
- పంచాయతీ రాజ్, శిశు సంక్షేమ శాఖలతో తొలి మీటింగ్
- హాజరైన డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి సీతక్క
హైదరాబాద్, జనవరి 8 (విజయక్రాం తి): 2025-26 బడ్జెట్ సన్నాహాక సమావేశాలు ప్రారంభమయ్యాయి. వచ్చే ఏడాది బడ్జెట్ అంచనాలపై శాఖల వారీగా ఆర్థికశాఖ సమీక్షలు చేపట్టేందుకు సిద్ధమైంది. బుధవారం తొలి ప్రీ బడ్జెట్ మీటింగ్ సచివాలయంలో పంచాయతీరాజ్, మహిళా శిశు సంక్షేమ శాఖలతో నిర్వహించింది.
ఆర్థిక మంత్రి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్కతో పాటు రెండు విభాగాల ముఖ్య అధికారులు హాజరయ్యారు. బడ్జెట్ కోసం ఇప్పటికే ఆర్థిక శాఖ అన్ని డిపార్ట్‌మెంట్స్ నుంచి ప్రతిపాదనలు కోరింది. అన్ని శాఖలు జనవరి 4 నాటి కి తమ శాఖలకు వచ్చే బడ్జెట్‌లో అవసరమైన ప్రతిపాదలను ఆన్‌లైన్ ద్వారా ఆర్థిక శాఖకు పంపించారు.
డిపార్ట్‌మెంట్ల ద్వారా వచ్చిన ప్రతిపాదనలను ఫైనాన్స్ విభాగం అన్ని శాఖలతో సమీక్షించి.. బడ్జెట్ అంచనా లు రూపొందించనుంది. అందులో భాగం గా మొదటి సమావేశాన్ని మంత్రి సీతక్క శాఖలతో భట్టి షురూ చేశారు. ఆయా శాఖ లు పంపిన ప్రతిపాదనలపై సమీక్షల ప్రక్రి య అంతా ఈనెల 31నాటికి పూర్తి చేయాలని ఆర్థిక శాఖ భావిస్తోంది.
31 నాటికి పూర్త యితే.. ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్ ఉంటుంది కాబట్టి.. అందులో రాష్ట్రానికి కేటాయింపులను చూసి.. రాష్ట్ర పద్దులో ఏమైనా మార్పులు చేర్పులు చేయడానికి సులువుగా ఉంటుందని సర్కారు ఆలోచిస్తోంది.
రూ.1600కోట్లకు పెంచండి..
2025-26 బడ్జెట్‌లో తమకు నిధులు పెంచాలని పంచాయతీ రాజ్, శిశు సంక్షేమ విభాగాలు ఆర్థిక శాఖను కోరాయి. 2024 -25 బడ్జెట్‌లో పంచాయతీ రాజ్‌కు రూ. 29,816 కోట్లు కేటాయించగా.. శిశు సంక్షే మ శాఖకు రూ.2,736కోట్లను సర్కారు కేటాయించింది. అయితే ఈ బడ్జెట్‌లో పంచా యతీ రాజ్ శాఖకు రూ.1,000కోట్లు, శిశు సంక్షేమ విభాగానికి రూ.600కోట్లు అదనం గా పెంచాలని ప్రతిపాదించాయి.
అనంతరం డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క ఈ రెండు శాఖల్లో పురోగతిపై మాట్లాడారు.. గ్రామీణ అభివృద్ధి, స్త్రీ శిశు సంక్షేమ శాఖలతో కోట్లాదిమంది జీవితాలతో ముడిపడి ఉన్నాయన్నారు. అంగన్వాడీ కేంద్రాల ద్వారా రాష్ర్ట క్రీడా ప్రాధికార సంస్థ నుంచి స్పోర్ట్స్ కిడ్స్ అందిస్తామన్నారు. స్పోర్ట్స్ కిట్స్ అందజేయాల్సిందిగా క్రీడా ప్రాధికార సంస్థ చైర్మన్ శివసేన రెడ్డికి స్వయంగా డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క ఫోన్ చేసి సూచించారు.
శిశు విహార్‌లోని శిశువులపై భట్టి, సీతక్క ఆరా..
శిశు విహార్‌లో ఉన్న శిశువులు, వారికి అందుతున్న సదుపాయాలపై డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి సీతక్క అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో ఉన్న మహిళా ప్రాంగణాల పరిస్థితిపై ఆరా తీశారు. ట్రాన్స్ జెండర్ల సేవలను ప్రస్తుతం హైదరాబాద్ ట్రాఫిక్ కూడళ్లలో వినియోగిస్తున్నారని, ఈ ప్రయోగం విజ యవంతం అయితే మండల కేంద్రాల్లో నూ విస్తరించే ఆలోచనలో ఉన్నామని సీతక్క పేర్కొన్నారు.
ఆర్థిక శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు, గ్రామీ ణ అభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ లోకేశ్ కుమార్, స్త్రీ శిశు సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ అనితా రామచంద్ర న్, డిప్యూటీ సీఎం స్పెషల్ సెక్రటరీ కృష్ణ భాస్కర్ పాల్గొన్నారు.