calender_icon.png 10 January, 2025 | 9:14 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

స్మార్ట్ దోపిడీకి సిద్ధం

10-01-2025 12:00:00 AM

పార్కులు ప్రైవేట్ పరం

కరీంనగర్, జనవరి 9 (విజయక్రాంతి): కరీంనగర్ నగరపాలక సంస్థ పరిధిలోని పా ర్కులను ప్రైవేట్ పరం చేసేందుకు నగరపా లక సంస్థ సిద్ధం కావడంతో సందర్శకులు, వాకర్స్‌పై పెనుభారం పడనుంది. కరీంనగర్ నగరపాలక సంస్థ పరిధిలోని పాత సర్కస్ గ్రౌండ్‌ను స్మార్ట్ సిటీ నిధులతో జ్యోతిబాపూ లే పార్కును నిర్మించారు.

ఈ పార్కులో సింథటిక్ ట్రాక్ తోపాటు కుటుంబ సమే తంగా సాయంత్రం సమయంలో ఉల్లాసం గా గడిపేందుకు చక్కని లాక్ను, ఫౌంటెయి న్లను, చిన్నపాటి సమావేశాలు నిర్వహించేం దుకు. వేదికను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం నగరపాలక సంస్థ పరిధిలో ఈ పార్కు నిర్వ హణ కొనసాగుకుంది. ఈ పార్కుకు వచ్చేవా రి వద్ద నుంచి నామమాత్రంగా నగరపాలక సంస్థ సిబ్బందిచే ఫీజులు వసూలు చేస్తున్నా రు.

అయితే ప్రస్తుతం ఈ పార్కును ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించేందుకు రంగం సిద్ధం చేశారు. ఈ నెల 10లోపు టెండర్లను ఆహ్వా నించి 15న టెండర్లను తెరిచి ఫిబ్రవరి 1 నుంచి టెండరాదారులకు అప్పగించను న్నారు. టెండర్లో పాల్గొనేవారు కనీన చెల్లిం పు రెండు సంవత్సరాలకు 10 లక్షలుగా నిర్ణ యించారు. టెండర్ లో పాల్గొనేవారి సంఖ్య ఎక్కువైతే 20 లక్షల వరకు వెళ్లినా ఆశ్చర్యం లేదు.

దీనిని అనుకొని పురాతన మల్టిపర్సస్ స్కూల్ను స్మార్ట్ సిటీ కింద అభివృద్ధి చేశారు. పనులు ఇంకా పూర్తికాకున్నా, పిల్లల పార్కు లో ఏర్పాటు చేసిన అతవస్తవుల ఫిట్టింగ్ కూడా పూర్తి కాలేదు. ఈ పార్కు నిర్వహణకు కూడా టెండర్లు పిలిచారు. కనీస ధర రెండు సంవత్సరాలకు 20 లక్షలుగా నిర్ణయించా రు. మల్టీపర్సన్ పురాతన భవనాన్ని హెరిటే జ్ సెంటర్గా మార్చాలని నిర్ణయించారు.

అయితే ఈ పనులు ఇంకా పూర్తికాలేదు. కేవలం ఈ స్కూల్ చుట్టూ పూలమొక్కలు ఏర్పాటు చేశారు. పనులు పూర్తికాకున్నా ఈ పార్కును కూడా ప్రైవేటుపరం చేసేందుకు సిద్ధం కావడంతో నగరవాసుల నుండి విమర్శలు వస్తున్నాయి. ఈ రెండు ప్రాంతా ల్లో ప్రతిరోజు ఉదయం, సాయంత్రం వంద లాదిమంది వాకర్స్ నడుస్తుంటారు.

ఈ పార్కులను ప్రైవేట్పరం చేయడు వల్ల వాక ర్స్కు ఇబ్బందిగా మాలే అవకాశం ఉంది. రోజుచారి, నెలవారి ఫీజులు చెల్లించి వాకింగ్ చేసే బదులు మరో ప్రాంతంలో వాకింగ్ చేయాలని నిర్ణయించుకుంటున్నారు. పాళ్కు ల సందర్శకులు కూడా ప్రైవేట్పరం చేయడు వల్ల ఎంట్రీ ఫీజు పెంచే అవకాశం ఉందని, ప్రైవేట్‌పరం చేయవద్దని కోరుకుంటున్నారు.

పనుల్లో నాణ్యత లోపం 

స్మార్ట్ సిటీ పనులలో భాగంగా కేంద్ర ప్రభుత్వ వాటా మరియు రాష్ర్ట ప్రభుత్వ వాటా ధనం దాదాపు పదకొండు కోట్ల తో పనులు చేపట్టిన మల్టీ పర్పస్ పార్కు పనులలో నాణ్యతలో లోపాలున్నయి.  వారసత్వ కట్టడం మల్టీ పర్పస్ పాఠశాల దెబ్బతిని ఉంది. తీర్చి దిద్దాల్సిన అవస రంది. ఈ పనులపై విచారణ జరపవ లసిన అవసరం ఉంది.

 సుడా చైర్మన్ నరెండేర్ రెడ్డి