02-03-2025 12:47:26 AM
90వ దశకంలో హీరోయి న్ రంభ పేరు మార్మోగిపోయింది. తమిళం, తెలుగు, మలయాళం, హిందీ, కన్నడ ఇలా భాషాభేదం లేకుండా అన్ని ఇండస్ట్రీల్లో తన ముద్ర వేశారామె. నటిగా ఆమె కెరీర్‌లో మరుపురాని క్లాసిక్ చిత్రాలెన్నో! ఆమె గ్లామర్, నటన, గ్రేస్ ఫుల్ స్టెప్పులకు అప్పటి ప్రేక్షకులు ఫిదా అయ్యేవారు.
కొన్నేళ్లుగా సినీ పరిశ్రమకు, నటనకు దూరంగా ఉన్న రంభ రీ ఎంట్రీకి సిద్ధమవుతోంది. రంభ ఈ విషయాన్ని చెప్తూ.. ‘నా ఫస్ట్ ఛాయిస్ ఎప్పుడూ సినిమానే. ఇక ఇప్పుడు ఎలాంటి ఛాలెంజింగ్ రోల్స్ చేసేందుకైనా సిద్ధంగా ఉన్నా. ఇదే సరైన సమయమని భావిస్తున్నా. కొత్త పాత్రలతో ఆడియెన్స్‌ను ఆకట్టుకోవాలని చూస్తున్నా’ అన్నారు.
ఇక అభిమానులు ఆమె రీ ఎంట్రీ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరి రంభ సెకండ్ ఇన్నింగ్స్ ఎలా ఉంటుందో.. ఎలాంటి చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వస్తుందో చూడాలి.