23-02-2025 10:55:09 PM
మాజీ మంత్రి జలగం ప్రసాదరావు..
సత్తుపల్లి (విజయక్రాంతి): సత్తుపల్లి మండలం పరిధిలోని గంగరాం గ్రామంలో ఆదివారం మాజీ మంత్రి జలగం ప్రసాద్ రావు పర్యటించారు. ఈ సందర్బంగా ఆయన పార్టీ అనుచరులతో సమావేశమయ్యారు. త్వరలో జరగనున్న స్థానికసంస్థల ఎన్నికలకు సిద్ధం కావాలని ఈ సందర్బంగా తన వర్గీయులకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీమంత్రి అనుచరులు, అభిమానులు, కార్యకర్తలు పాల్గొన్నారు.