బీజేపీ సభ్యత్వ నమోదులో ఎంపీలు రఘునందన్ రావు, కొండా విశ్వేశర్ రెడ్డి
మొయినాబాద్‌లో సభ్యత్వ నమోదు పరిశీలన
చేవెళ్ల, ఆగస్టు 26: కాంగ్రెస్ పార్టీ రిజర్వేషన్లు మార్చి కొత్త పంచాయతీ చట్టంతో స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్తుందని తాను అనుకోవడం లేదని.. నవంబర్‌లోనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉం దని మెదక్ ఎంపీ రఘునందన్ రావు జోస్యం చెప్పారు. సోమవారం మొయినాబాద్‌లో నిర్వహించిన పార్టీ సభ్వత్వ నమో దు కార్యక్రమానికి చేవెళ్ల ఎంపీ విశ్వేశ్వర్ రెడ్డితో కలిసి ఆయన హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అక్టోబర్ 31లోగా సభ్వత్వ నమోదు పూర్తిచేసి స్థానిక సంస్థల ఎన్నికలు సిద్ధంగా ఉండాలని పార్టీ నాయకులకు పిలుపునిచ్చారు. జిల్లాకు ఇచ్చిన లక్ష్యాన్ని చేరుకోవాలని.. పనిచేయని వారిపై పార్టీకి రిపోర్టు ఇవ్వాలని సూచించారు. తనకు జిల్లా నేతలతో వ్యక్తిగతంగా మంచి అనుబంధం ఉందని అన్నారు. ఎన్నికల్లో ఎంత డబ్బైనా ఖర్చుపెట్టేవారు ఉన్నప్ప టికీ మెదక్ ప్రజలు నాపై విశ్వాసంతో నన్ను గెలిపించారని.. వారి సమస్యలను పరిష్కరించి వారి రుణం తీరచుకుంటానన్నారు.
జిల్లాను అగ్రగామిగా నిలుపుదాం..
సభ్యత్వ నమోదులో రంగారెడ్డి జిల్లాను దేశంలోనే నంబర్ వన్‌గా నిలుపుదామని చేవెళ్ల ఎంపీ విశ్వేశ్వర్ రెడ్డి పిలుపునిచ్చారు. ఊళ్లకు వెళ్లి పేరు, ఊరు, ఫోన్ నంబర్ తీసుకొని రాసుకోవడమే కాకుండా.. సభ్యత్వ నమోదును ఎలక్షన్ క్యాంపెయిన్ మాదిరిగా నిర్వహించాలని సూచించారు. మహిళా మెంబర్‌షిప్‌లపై ఫోకస్ చేయాలని కార్యకర్తలను కోరారు. అలాగే గత బీఆర్‌ఎస్, ప్రస్తు త కాంగ్రెస్ వైఫల్యాలను ప్రజల్లో బలంగా తీసుకుపోవాలన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు బొక్క నర్సింహారెడ్డి, మాజీ ఎమ్మెల్యే రత్నం, నేషనల్ బీసీ కమిషన్ మాజీ మెంబర్ తల్లోజు ఆచారి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.