మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్...
నడిగూడెం (విజయక్రాంతి): స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధం కావాలని కోదాడ మాజీ శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్ అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలో కొల్లు కోటయ్య ఫంక్షన్ హాల్ లో జరిగిన మండల బీఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం మండల పార్టీ అధ్యక్షుడు పల్లా నర్సిరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి సంవత్సరం గడిచినప్పటికీ ఆరు గ్యారంటీలలో ఒక పథకం కూడా కొలిక్కి రాలేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం డైవర్షన్ రాజకీయాలు చేస్తుందని అన్నారు. బీఆర్ఎస్ నాయకులపై అక్రమ కేసులు బనాయిస్తుందని కేసులకు భయపడేది లేదని అన్నారు. రానున్న గ్రామపంచాయతీ ఎన్నికల్లో నడిగూడెం మండలంలో ఎక్కువ గ్రామపంచాయతీలలో బీఆర్ఎస్ జెండాను ఎగరేయాలన్నారు.
కష్టపడ్డ కార్యకర్తకు ప్రాధాన్యత ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల సమన్వయ సమితి కమిటీ సభ్యులు అనంతుల ఆంజనేయులు, గార్లపాటి శ్రీనివాస్ రెడ్డి, జిల్లా ఉద్యమకారులు అనంతల మహేష్ గౌడ్, మాజీ జెడ్పిటిసి మారుతి ఉపేందర్, దాసరి శ్రీనివాస్ దున్న రవి, గ్రామ శాఖ అధ్యక్షులు, బోనగిరి ఉపేందర్, పోలపల్లి వెంకటేశ్వర్లు, గార్లపాటి సురేందర్, వెంకటేశ్వర్లు, నాగేందర్, కాసాని ఉపేందర్, బోల్లేపల్లి వెంకన్న బడేటి శీను, దున్న సుధాకర్, దొడ్డ నరసింహారావు, గోలిసునీత, మండల సీనియర్ నాయకులు బొల్లం శ్రీనివాస్, మేకల గంగరాజు, దున్న ప్రవీణ్, ఎస్కే రఫీ, మండల యూత్ నాయకులు మేకల వీరబాబు, కన్నెబోయిన మురళీకృష్ణ, బడుగుల వెంకటేష్, కన్నెబోయిన మురళి, తదితరులు పాల్గొన్నారు.