జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు
కామారెడ్డి (విజయక్రాంతి): కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధం కావాలని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు పిలుపునిచ్చారు. శనివారం కామారెడ్డి జిల్లా మద్నూర్ మండల కేంద్రంలో మార్కెట్ యార్డులో కాంగ్రెస్ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామ సమస్యలను తెలుసుకొని తనకు తెలిపితే పరిష్కరిద్దామని తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో మొత్తం కాంగ్రెస్ అభ్యర్థులే గెలవాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలని కోరారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో చేస్తున్న ప్రభుత్వ పథకాలను ఇంటింటికి వివరించాలని కోరారు. ఈ సమావేశంలో మండల పార్టీ అధ్యక్షుడు సాయిలు విండో చైర్మన్ శ్రీనివాస్ పటేల్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు హనుమంతరావు, దేశాయ్ బస్వంత్ రావు, సోమవార్ మహేష్, నాగేశ్వరరావు, విఠల్రావు, నాగనాథ్ తదితరులు పాల్గొన్నారు.