calender_icon.png 16 October, 2024 | 6:01 PM

దుష్టశక్తితో యుద్ధానికి సిద్ధం

08-10-2024 12:00:00 AM

మంచు లక్ష్మి ప్రధాన పాత్రలో దర్శకుడు సంజీవ్ మేగోటి తెరకెక్కిస్తున్న పీరియాడిక్ ప్రేమకథా చిత్రం ‘ఆదిపర్వం’. ఏఐ ఎంటర్ టైన్‌మెంట్స్‌తో కలిసి అన్వికా ఆరట్స్ పతాకంపై గ్రాఫిక్స్ ప్రధానంగా ఈ చిత్రం రూపొందుతోంది. ఎగ్రుడి నేపథ్యంలో అమ్మవారి చుట్టూ అల్లుకున్న పీరియాడిక్ ప్రేమకథలో మంచు లక్ష్మితోపాటు ఆదిత్యం ఓం మరో కీలక పాత్రను పోషిస్తుండగా, ఎస్తేర్, సుహాసిని, శ్రీజిత ఘోష్, శివ కంఠమనేని, వెంకట్ కిరణ్, సత్య ప్రకాశ్, సమ్మెట గాంధీ, జెమినీ సురేశ్, ఢిల్లీ రాజేశ్వరి తదితరులు వివిధ పాత్రల్లో నటించారు.

ఈ సినిమా ఈ నెల 31న థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది. మంచు లక్ష్మి పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రంలో ఆమె క్యారెక్టర్ ఫస్ట్‌లుక్‌ను మేకర్స్ సోమవారం రిలీజ్ చేశారు. “1974--90 మధ్యకాలంలో జరిగిన యధార్థ ఘటనల సమాహారంగా ‘ఆదిపర్వం’ను రూపొందించాను. ‘అమ్మోరు’, ‘అరుంధతి’ తరహాలో దుష్టశక్తికి, దైవశక్తికి మధ్య జరిగే యుద్ధమే ఈ సినిమా.

మా మూవీలో గ్రాఫిక్స్ హైలైట్ అవుతాయి” అని దర్శకుడు తెలిపారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: ఎస్‌ఎన్ హరీశ్; మ్యూజిక్: మాధవి సైబ, ఓపెన్ బనాన ప్రవీణ్, సంజీవ్, బి.సుల్తాన్ వలి, లుబెక్ లీ, రామ్ సుధీ; ఫైట్స్: నటరాజ్.