calender_icon.png 16 January, 2025 | 8:13 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎస్సీ సబ్‌ప్లాన్‌కు ప్రణాళిక సిద్ధం చేయండి

03-09-2024 03:53:31 AM

అధికారులకు ఎమ్మెల్యే కవ్వంపల్లి ఆదేశాలు

కరీంనగర్, సెప్టెంబరు 2 (విజయక్రాంతి): ఎస్సీ సబ్‌ప్లాన్ నిధులతో ఎస్సీ కా లనీల్లో రోడ్లు, డ్రైనేజీల ఏర్పాటుకు ప్రణాళిక సిద్ధం చేయాలని మానకొండూర్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ పంచాయతీరాజ్ అధికారులను ఆదేశించారు. సోమవారం ఎల్‌ఎండీ కాలనీలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ.. నియోజకవర్గానికి ఎస్సీ సబ్‌ప్లాన్ కిం ద మంజూరైన రూ.పది కోట్లతో ఎస్సీ కాలనీల్లో పనులు చేపట్టాలని, ఇందుకు ప్రణాళిక ను తయారు చేయాలని కోరారు. ఈ సమావేశంబలో పంచాయతీరాజ్ డిప్యూటీ ఇంజ నీర్లు రవి ప్రసాద్, మంజుభార్గవి, ఏఈలు సురేందర్‌రెడ్డి, వెంకన్న, మల్లేశం, స్నేహజ్యోతి, సమ్మయ్య, అజహర్, తదితరులు పాల్గొన్నారు.