12-02-2025 07:44:57 PM
ఇల్లెందు (విజయక్రాంతి): ఇల్లందులోని ఆర్యవైశ్య కళ్యాణమండపంలో ఉపాధ్యాయ ఎంఎల్ సి ఎన్నికల సందర్భంగా బీజేపీ అభ్యర్ధి పులి సరోత్తంరెడ్డి విజయం కోసం ఎన్నికల సన్నాహక సమావేశం జరిగినది. ఈ సమావేశానికి జిల్లా ఇంచార్జ్ రాష్ట్ర నాయకులు ఎడ్ల అశోక్ రెడ్డి, సహా ఇంచార్జ్ జిల్లా సీనియర్ నాయకులు జీవీకే మనోహర్ మార్గదర్శనం చేశారు, ఈ ఎన్నికల్లో ఉపాధ్యాయ సమస్యల పట్ల విశాల అవగాహన ఉన్నవారు, మాజీ ఉపాధ్యాయ సంఘ రాష్ట్ర నాయకులుగా ఎంతో అనుభవం కలిగి, ఉపాధ్యాయులకు ఎప్పుడూ అందుబాటులో ఉండే పులి సరోత్తం తప్పక విజయం సాధిస్తారని, 10 నెలల్లోనే అన్నివర్గాల ప్రజల వ్యతిరేకత పొందిన కాంగ్రెస్ పాలన పట్ల ఉపాధ్యాయ వర్గాల్లో కూడా తీవ్ర వ్యతిరేకత ఉందని, ఎన్నికల హామీల్లో పీఆర్సీ అమలు వాగ్దానాన్ని అమలుచేయకపోవడం వల్ల ఉపాధ్యాయులంతా పులి సరోత్తం రెడ్డినే గెలిపించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఎన్నికల నియోజకవర్గ ఇంచార్జ్ పుణ్యనాయక్, జిల్లా ఉపాధ్యక్షులు రామచంద్ర నాయక్, రాష్ట్ర ఓబీసీ కార్యవర్గ సభ్యులు మావునూరి మాధవ్, జిల్లా అధికార ప్రతినిధి దోమల మహేశ్వర్, రాష్ట్ర గిరిజన మోర్చ అధికార ప్రతినిధి భూక్యా శ్రీను నాయక్, పట్టణ ఉపాధ్యక్షులు శివకుమార్ ఖండేల్ వాల్ తదితరులు పాల్గొన్నారు.