calender_icon.png 16 April, 2025 | 1:56 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాజ్యాంగ పరిరక్షణకు అన్ని వర్గాల ప్రజలు ముందుకు రావాలి

04-04-2025 05:30:54 PM

బెల్లంపల్లి,(విజయక్రాంతి): రాజ్యాంగ పరిరక్షణకు అన్ని వర్గాల ప్రజలు ముందుకు రావాలని బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ అన్నారు. శుక్రవారం కాసిపేట మండలంలో జై బాబు, జై భీమ్, జై సమ్మిదాన్, రాజ్యాంగ పరిరక్షణ సన్నాహక సమావేశం, ర్యాలీలో పాల్గొన్నారు. కాసిపేట మండల కేంద్రంలోని అంబేద్కర్, గాంధీ మహాత్ముని విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వినోద్ మాట్లాడుతూ మహనీయులు అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని గౌరవించాలన్నారు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన నాటి నుండి ప్రభుత్వం అందిస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలని చెప్పారు. స్థానిక సంస్థల ఎన్నికలలో విజయాన్ని సాధించే దిశగా రాజ్యాంగ పరిరక్షణ కార్యక్రమాన్ని సమర్ధవంతంగా జరుపుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జై బాపు, జై భీమ్ జై సమ్మిదాన్ కోఆర్డినేటర్ వైద్యుల అంజన్ కుమార్, పీసీసీ జనరల్ సెక్రెటరీ రఘునాథరెడ్డి, సీనియర్ నాయకులు కారుకూరి రామ్ చందర్, మండల పార్టీ అధ్యక్షులు రత్నం ప్రదీప్ తో పాటు పలువురు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.