20-03-2025 12:21:11 AM
ప్రస్తుతం ప్రపంచం మొత్తం మార్మోగుతున్న పేరు సునీతా విలియమ్స్. భారత సంతతికి చెందిన అమెరికన్ వ్యోమగామి సునీత విలియమ్స్ దాదాపు బుధవారం తెల్లవారుజామున భూమి మీదకు చేరుకున్నారు. ఆమె 9 నెలల పాటు అంతరిక్షంలో గడిపి స్పేస్ ఎక్స్ క్రూ డ్రాగన్ వ్యోమనౌకలో భూమి మీదకు వచ్చారు. ఆమె క్షేమంగా చేరుకోవాలని యావత్ ప్రపంచం కోరుకుంది. అయితే సునీతా విలియమ్స్ గురించి ప్రస్తుతం ఒక ఆసక్తికర వార్త వైరల్ అవుతోంది.
త్వరలోనే ఆమె జీవిత చరిత్ర ఆధారంగా సినిమా రూపొందనుందట. దీనికి సంబంధించిన సన్నాహాలు ఇప్పటికే మొదలైనట్టుగా తెలుస్తోంది. బాలీవుడ్‌కి చెందిన ప్రముఖ దర్శకనిర్మాతలు ఈ బయోపిక్ తీసేందుకు సిద్ధమవుతు న్నారని టాక్. మరోవైపు హాలీవుడ్‌లోనూ సునీతా విలియమ్స్ బయోపిక్‌పై చర్చలు జరుగుతున్నాయని ప్రచారం జరుగుతోంది.
ఆమె జీవితంలోని స్ఫూర్తిదాయక అంశాలు, శిక్షణ, నాసాలో చేరడం, అంతరిక్షంలో తొమ్మిది నెలలపాటు గడపడం, సురక్షితంగా భూమిపైకి చేరుకోవడం వంటి అంశాల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కనుం దట. దీనికి బాలీవుడ్ ప్రముఖ దర్శకుడొకరు ఆసక్తి చూపిస్తున్నారట. సునీత భారత సంతతికి చెందిన వ్యక్తి కావడంతో ఇక్కడ మూవీ ని బాగా ఆదరిస్తారని భావి స్తున్నారట.