calender_icon.png 24 October, 2024 | 10:00 PM

రెండో విడుత రుణమాఫీకి సన్నాహాలు

23-07-2024 01:16:24 AM

మంత్రి తుమ్మల

హైదరాబాద్, జూలై 22 (విజయక్రాంతి):  రెండవ విడుత రుణమాఫీ సాధ్యమైనంత త్వరగా అమలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉం దని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. సోమవారం ఓ ప్రకటనలో ఆయన రుణమాఫీ వివరాలు వెల్లడించారు. మొదటి విడుతగా రూ.లక్షలోపు రుణాలు 11.50 లక్షల కుటుంబాల కు రూ.6,098 కోట్ల మేర విడుదల చేశామని తెలిపారు. ఆబీఐ అందిన సమాచారం మేరకు 11.32 లక్షల కుటుంబాలకు రూ.6,014 కోట్లు జమ చేసినట్లు చెప్పారు.

కొన్ని సాం కేతిక కారణాలతో 17,877 ఖాతాల కు చెందిన రూ.84.94 కోట్లు ఆయా రైతుల ఖాతాల్లో జమ కాలేదన్నారు. ఆర్‌బీఐ సూచనల మేరకు, రైతుల ఖాతాల్లో సాంకేతిక సమస్యలను సరిచేసి, ఆర్‌బీఐ నుంచి నిధులు వెనక్కి రాగానే తిరిగి నిధులు జమచేస్తామని హామీ ఇచ్చారు. వాణిజ్య బ్యాంకులకు అనుసంధానించబడిన ప్రాథ మిక వ్యవసాయ సహకార సంఘాలకు సంబంధించి న రుణాల తనిఖీ సోమవారంతో పూర్తవుతుందని, ఆ వెంటనే ఆయా ఖాతాలకు కూడా రుణమాఫీ నిధులు విడుదల చేస్తామని తెలిపారు.