05-04-2025 12:29:35 AM
మేడ్చల్, ఏప్రిల్ 4 (విజయ క్రాంతి): మేడ్చల్ పట్టణంలో జాతీయ రహదారి విస్తరణకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఇరువైపుల 75 అడుగుల చొప్పున వెడల్పు చేయాలని అధికారులు నిర్ణయించారు. మొ దట 50 అడుగులు ఖరారు చేశారు. కానీ 50 అడుగులు వెడల్పు ఉంటే రోడ్డు ఇరుకుగా ఉంటుందని, ఫ్లై ఓవర్ నిర్మాణంలో భాగంగా పిల్లర్ల మీద స్లాబు వేసే సమయంలో ఇబ్బంది అవుతుందనే ఉద్దేశంతో 75 అడుగులు ఫైనల్ చేశారు. మాస్టర్ ప్లాన్ లో 200 అడుగుల రోడ్డు ఉంది. విలువైన భవనాలకు రోడ్డు విస్తరణలో నష్టం జరుగుతుందని ఉద్దేశంతో 150 అడుగులకు కుదించారు.
రోడ్డు వెడల్పు చేసిన తర్వాతే ఫ్లై ఓవర్ స్లాబు..
ప్రస్తుతం పట్టణంలో రోడ్డు ఇరుకుగా ఉంది. పక్కన రోడ్డు వెడల్పు చేయడానికి అవకాశం ఉన్నప్పటికీ రోడ్డు వెడల్పు చేయకుండా పిల్లర్ల పనులు కొనసాగించారు. దీని వల్ల ట్రాఫిక్ కు చాలా ఇబ్బంది అయింది. పిల్లర్ల నిర్మాణం తుదిదశకు చేరినందున త్వరలో స్లాబు పనులు మొదలుపెట్ట నున్నారు. స్లాబ్ వేసే సమయంలో రోడ్డు విశా లంగా ఉండాలి. రోడ్డు వెడల్పు చేస్తేనే స్లాబ్ బిల్లలు వేయడానికి అవకాశం ఉంటుంది.
గృహ యజమానులకు నోటీసులు జారీ
ఇరువైపుల 75 అడుగులు వెడల్పు చేయాలని నిర్ణయించినందున ఎన్ని ఇళ్లకు నష్టం జరుగుతుందనే విషయం గుర్తించారు. ఇళ్లకు మార్కింగ్ చేశారు. మార్కింగ్ చేసినంతవరకు భూ సేకరణ చేయాల్సి ఉంటుంది. సంబంధిత ఇంటి యజమానులకు మునిసిపల్ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఇంటి డాక్యుమెంట్లు తీసుకుని రావాలని సూచించారు. పెద్ద భవనాలు కాకుండా చిన్న చిన్న దుకాణాలు రోడ్డు విస్తరణలో పోయే అవకాశం ఉంది.
నోటీసులు జారీ చేశాం
బి. నాగిరెడ్డి, మున్సిపల్ కమిషనర్, మేడ్చల్ జాతీయ రహదారి ఇరువైపులా 75 అడుగులు వెడల్పు చేయాలని నిర్ణయించినందున గృహ యజమానులకు నోటీసులు జారీ చేశాం. గృహాలకు సంబంధించి డాక్యుమెంట్లు తీసుకొని రావాలని సూచించాం.