28-02-2025 02:02:52 AM
జిల్లా కలెక్టర్ సిక్త పట్నాయక్
నారాయణపేట, ఫిబ్రవరి 27(విజయక్రాంతి): పవిత్ర రంజాన్ మాసం ప్రారంభం అవుతున్న నేపథ్యంలో సౌకర్యాల కల్పనపై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించాలని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అధికారులను ఆదేశించారు. కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ ఛాంబర్ లో గురువారం అధికారులతో సమావేశమై, రంజాన్, సందర్భంగా చేపట్టాల్సిన ఏర్పాట్లు, కల్పించాల్సిన సౌకర్యాలపై సమీక్ష జరిపారు. ఎలాంటి ఇబ్బందులు, లోటుపాట్లకు తావులేకుండా జిల్లా వ్యాప్తం గా అన్ని పట్టణాలు, మండల కేంద్రాలు, గ్రామాలలో మౌలిక సదుపాయాలు.
అందుబాటులో ఉండేలా సమన్వయంతో పని చే యాలని అధికారులకు సూచించారు. ప్రధానంగా ఎక్కడ కూడా తాగునీరు, పారిశుధ్యం వంటి సమస్యలు తలెత్తకుండా క్షేత్రస్థాయి అధికారులు, సిబ్బందికి బాధ్యతలు పురమాయిస్తూ, నిరంతరం పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు. విద్యుత్ సరఫరాలో అంతరాయం అంతరాయం లేకుండా చూడాలని, వీధి లైట్ల మరమ్మతులు జరిపించాలన్నారు. బోర్లు, పైప్ లైన్ మరమ్మతులు ఉంటే ముందస్తుగా చేపట్టాలని తెలిపారు.
అన్ని ప్రాంతాలకు నీటి సరఫరా జరిగేలా చర్యలు చేపట్టాలని మిషన్ భగీరథ అధికారులను ఆదేశించారు. ప్రార్థనా సమయాలలో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగకుండా తగిన ఏర్పాట్లు చేయాలని విద్యుత్ శాఖ డి.ఈ. కి సూచించారు. మసీదులు, ఈద్గాల వద్ద పారిశుధ్య సమస్య లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఎక్కడ కూడా శాంతి భద్రతల సమస్య తలెత్తకుండా చర్య లు తీసుకోవాలని, సమస్యాత్మక ప్రాంతాలలో ప్రత్యేక నిఘాను ఏర్పాటు చేయాలని పోలీసు అధికారులకు సూచించారు.
కాగా, వేసవి సీజన్ ప్రారంభం అవుతున్న దృష్ట్యా తాగునీటి సరఫరాకు ఇబ్బందులు తలెత్తకుండా ప్రణాళికాబద్ధంగా కృషి చేయాలని మున్సిపల్ కమీషనర్లను సూచించారు. ఈ సమావేశంలో సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు. అదనపు కలెక్టర్ మాట్లా డుతూ యాక్షన్ ప్లాన్ ప్రకారం ముందుకు పోతామని తెలిపారు.పోలీస్,విద్యుత్ డిఎంహెచ్వో ఆర్డీవో సివిల్ సప్లు మున్సిపల్ కమీషనర్లు తదితర శాఖలు వారు సమిష్టి కృషి చేయాలన్నారు. ఆర్డీవో మాట్లాడుతూ రెవిన్యూ సంబందించిన అన్ని ఏర్పాట్లు చేస్తామన్నారు.
మున్సిపల్ కమీషనర్ లు రంజాన్ పండుగ రోజు శ్యామ్యానాలు తాగునీరు తదితర ఏర్పాట్లు చేస్తామన్నారు. ఈ సమావేశంలో డీఎస్పీ లింగయ్య మాట్లాడుతూ రంజాన్ హోలీ,ఉగాది పండుగలకు శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తామని తెలిపారు. రంజాన్ పండుగ రోజు ఈద్గాలో దాదాపు పదివేల మంది ప్రార్థనలో హాజరు అవు తారని ఎలాంటి ఇబ్బందులు లేకుండా తగు చర్యలు తీసుకుంటామని తెలిపారు.
ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ రెవిన్యూ బెంషాలం,డి. ఎస్. పి. లింగయ్య ఆర్. డి. ఓ. రాంచందర్,మైనారిటీ అధికారి ఎం. ఎ. రషీద్,డిఆర్డిఓ మొఘలాప్ప, విద్యుత్ శాఖ డి. ఈ. జితేందర్ నాథ్,మున్సిపల్ కమీషనర్లు సంబంధిత అధికారులు అమీరుద్దీన్ అడ్వకేట్ అబ్దుల్ ఖాదర్,రఫీక్ చంద్,మొహమ్మద్ తాకి తదితరులు పాల్గొన్నారు.