శ్రద్ధా కపూర్ ప్రధాన పా త్రలో నటించిన చిత్రం ‘స్త్రీ 2’ గత ఏడాది విడుదలై బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. ఈ సినిమా తర్వాత శ్రద్ధాకు అవకాశాలు క్యూ కడుతున్నాయి. ఆమె ప్రధాన పాత్రలో ‘నాగిన్’ అనే సినిమాను ఐదేళ్ల క్రితం ప్రకటించారు. ఆ తరువాత ఎందుకోగానీ ఆ సినిమా ఊసే లేదు. దర్శక నిర్మాతలంతా ఓకే అయినా కూడా సినిమా ఎందుకు ఆగిపోయిందో ఎవరికీ అర్థం కాలేదు.
విశాల్ ప్యూరియా దర్శకత్వంలో రూపొందనున్న ఈ చిత్రాన్ని నిఖిల్ ద్వివేది నిర్మించనున్నారు. ఇన్నాళ్లకు నిఖిల్ ద్వివేది సినిమా గురించి గుడ్ న్యూస్ చెప్పారు. ఈ సినిమాను ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు వెల్లడించారు. “నాగిన్’ ప్రేమ, త్యాగాలకు సంబంధించిన కథతో రూపొందనుంది.
మరికొద్ది రోజుల్లో దీనిని సెట్స్ పైకి తీసుకెళ్లనున్నాం” అని నిఖిల్ ద్వివేది వెల్లడించారు. మొత్తానికి శ్రద్ధా కపూర్ ‘నాగిన్’ చిత్రంతో నటించేందుకు సిద్ధమవు తోంది. ‘స్త్రీ 2’లో దెయ్యం పాత్రలో నటించి మెప్పించిన ఈ ముద్దుగుమ్మ ‘నాగిన్’ చిత్రంలో పాములా కనిపించనుందని టాక్.