బాహుబలి3కి సన్నాహాలుదర్శకుడు ఎస్‌ఎస్.రాజమౌళి తెరకెక్కించిన ‘బాహుబలి’ చిత్రం టాలీవుడ్ ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయిలో నిలబెట్టింది. ఈ చిత్రం రెండు భాగాలుగా వచ్చి భారీ విజయంతోపాటు కలెక్షన్లు వసూలు చేసింది. మూడో భాగం కోసం ఎదురుచూస్తున్న సినీ ప్రియుల్లో ఉత్సాహం నింపే తాజా వార్త ఒకటి తెరపైకి వచ్చింది. కోలీవుడ్ నిర్మాత కేఈ జ్ఞానవేల్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘బాహుబలి3’పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బాహుబలి రెండు భాగాలకు తమిళంలో నిర్మాతగా జ్ఞానవేలే వ్యవహరించా రు.
ప్రస్తుతం ‘కంగువ’ ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్న ఆయన చేసిన తాజా వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. “గతవారమే ‘బాహుబలి’ మేకర్స్‌తో చర్చించాను. వారు మూడో భాగం ప్లాన్ చేసే పనిలో ఉన్నారు. దాని కన్నా ముందు రెండు సినిమాలున్నా యి” అని జ్ఞానవేల్ చేసిన కామెంట్స్ ప్రస్తు తం సోషల్ మీడియాలో వైరల్‌గా మారా యి. ఇదిలా ఉండగా.. రాజమౌళి ప్రస్తుతం ‘ఎస్‌ఎస్‌ఎంబీ29’ పనుల్లో నిమగ్నమై ఉన్నా రు. దీని తర్వాతే ఆయన ‘బాహుబలి3’ మొదలుపెట్టే అవకాశాలున్నాయని టాక్.