calender_icon.png 12 February, 2025 | 6:35 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎన్నికల నిర్వహణకు సన్నద్ధం కావాలి

12-02-2025 01:31:17 AM

జిల్లా కలెక్టర్ బి.యం. సంతోష్

గద్వాల, ఫిబ్రవరి 11 ( విజయక్రాంతి ) : రాబోవు ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నిర్వహణ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించేందుకు అన్ని విధాలుగా సన్నద్ధం కావాలని జిల్లా కలెక్టర్ బి.యం సంతోష్ సూచించారు. మంగళవారం కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల విధులను నిర్వర్తించనున్న రిటర్నింగ్ అధికారులకు రాష్ర్టస్థాయిలో శిక్షణ పొందిన ట్రైనర్ లతో శిక్షణ తరగతులు నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, గతంలో నిర్వహించిన ఎన్నికల అనుభవాలను దృష్టిలో పెట్టుకొని రాష్ర్ట ఎన్నికల కమిషన్ ఆదేశాలను తూ.చ. తప్పకుండా పాటిస్తూ ఎన్నికల విధులను జాగ్రత్తగా నిర్వహించాలని హితవు పలికారు.

ఎన్నికల ప్రక్రియను పూర్తి క్రమబద్ధంగా,నిబంధనలకు అనుగుణంగా నిర్వహించేందుకు ప్రతి అధికారి పూర్తి నిబద్ధతతో పనిచేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు లక్ష్మి నారాయణ, నర్సిగ్ రావు, జెడ్పీ డిప్యూటీ సీఈఓ నాగేంద్రం, రిటర్నింగ్ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.