calender_icon.png 9 November, 2024 | 3:45 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

క్వశ్చన్ బ్యాంక్ లేకుండానే ప్రశ్నాపత్రాల తయారీ!

09-11-2024 12:16:02 AM

ఇంటర్ విద్యా జేఏసీ చైర్మన్ 

హైదరాబాద్, నవంబర్ 8 (విజయక్రాంతి): క్వశ్చన్ బ్యాంక్ లేకుండానే ఇంటర్ ప్రశ్నపత్రాలను రూపొందిస్తున్నారని ఇంటర్ విద్యా జేఏసీ చైర్మన్ మధుసూదన్‌రెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇంటర్మీడియట్ విద్యామండలి రెండు రోజుల క్రితం ప్రారంభించిన పరీక్షా పత్రాలకు క్వశ్చన్ బ్యాంక్ మిస్సింగ్ అయిందా? లేదా సాఫ్ట్‌వేర్ సమస్యలేమైనా ఉన్నాయా? అనే విషయాన్ని గుట్టుగా ఉంచారా? అలా మ్యానువల్‌గా తయారు చేశారా? అనే అనుమానం వ్యక్తం చేశారు.

క్వశ్చన్ బ్యాంక్ లేకుండా ప్రశ్నాపత్రాలు తయారు చేస్తే అక్షర దోషాలు, ప్రశ్నల నంబర్లు తారుమారు అవడమేకాకుండా రెండు మార్కుల ప్రశ్నలకు బదులు పది మార్కుల ప్రశ్నలు ఇచ్చే అవకాశం ఉందన్నారు. నిపుణుల క్వశ్చన్ బ్యాంక్ ఆధారంగానే ప్రశ్నపత్రాలు ఉండాలన్నారు.

క్వశ్చన్ బ్యాంక్ మిస్ కాలేదు : ఇంటర్ బోర్డు

విజయక్రాంతి దినపత్రికలో శుక్రవారం ప్రచురితమైన ‘ఇంటర్ బోర్డులో పరీక్షల క్వశ్చన్ బ్యాంక్ మిస్’ అనే వార్తపై ఆమె స్పష్ట త ఇచ్చారు. ఎటువంటి క్వశ్చన్ బ్యాంక్ మిస్ కాలేదని ఇంటర్ బోర్డు పరీక్షల నియంత్రణ అధికారి జయప్రద తెలిపారు.