calender_icon.png 9 October, 2024 | 3:57 AM

నకిలీ సర్టిఫికెట్లు తయారీ

09-10-2024 01:53:49 AM

ఇద్దరు నిందితులు అరెస్ట్

హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 8 (విజయక్రాంతి): నగరంలోని అంబర్‌పేట పోలీ స్ స్టేషన్ పరిధిలో నకిలీ సర్టిఫికెట్లు తయా రు చేసి విక్రయిస్తున్న ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మల్కాజిగిరి ప్రాంతానికి చెందిన మహమ్మద్ మహ్ఫూజ్ ఇక్బాల్ అలియాస్ ఇక్బాల్ అంబర్‌పేటలో ఎమ్‌ఎస్ ఎం టర్‌ప్రైజెస్ పేరుతో జిరాక్స్, ఆన్‌లైన్ సెంటర్ నిర్వహిస్తున్నాడు.

వ్యాపా రం సరిగా నడవకపోవడం, నష్టాలు రావడంతో  తన స్నేహితుడైన అంబర్‌పేట ప్రాం తానికి చెందిన షేక్ ఇలియాస్ అహ్మద్‌తో కలిసి నకిలీ టెన్త్, ఇంటర్, డిగ్రీ తదితర సర్టిఫికెట్లను తయారు చేసి విక్రయించాలని ప్లాన్ చేశాడు. ఇక్బాల్ తనకున్న ఫొటోషాప్ అనుభవంతో కావాల్సిన వారికి సర్టిఫికెట్లు తయారు చేసి ఇవ్వడం ప్రారంభించాడు.

ఇలియాస్ అహ్మద్ ఏజెంట్‌గా వ్యవహరిస్తూ సర్టిఫికెట్లు కావాల్సిన వారిని ఇక్బాల్ వద్దకు పంపేవాడు. విశ్వసనీయ సమాచారంతో పోలీసులు నిందితులను మంగళవారం అరెస్ట్ చేశారు.  వారి నుంచి 84 నకిలీ సర్టిఫికెట్లు, జిరాక్స్ మిషన్‌తో పాటు సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. అంబర్‌పేట పోలీసులు నిందితులను కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించారు.