calender_icon.png 12 January, 2025 | 7:41 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గంధమల్ల రిజర్వాయర్ నిర్మాణానికి సిద్ధం

06-08-2024 04:45:10 AM

ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న

యాదాద్రి భువనగిరి,ఆగస్టు5(విజయక్రాంతి): ఆలేరు నియోజకవర్గానికి గోదా వరి జలాలు అందించడానికి ప్రతిపాదిత గంధమల్ల రిజర్వాయర్ నిర్మాణానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య, ఎమ్మె ల్సీ తీన్మార్ మల్లన్న తెలిపారు. సోమవా రం తుర్కపల్లి మండలం గంధమల్ల చెరువును సందర్శించిన అనంతరం మండల పరిషత్త్ కార్యాలయంలో రెవెన్యూ, నీటిపారుదల శాఖ అధికారులతో వారు సమీక్షా సమావేశం నిర్వహించారు.

వారు మాట్లాడుతూ.. ఆలేరు నియోజకవర్గానికి సాగునీటిని అందించడానికి గంధమల్ల రిజర్వాయర్‌ను 1.48 టీఎంసీల సామర్థ్యంతో చేపట్టనున్నట్టుగా ప్రకటించారు. ఇందుకు రూ.520 కోట్ల వ్యయమైతుందని అధికారులు ప్రాథమిక అంచనా వేసి నట్టుగా పేర్కొన్నారు. తక్కువ భూసేకరణ తో ప్రజలకు నష్టం లేకుండా రైతులకు మే లు చేయడమే తమ ప్రభుత్వ లక్ష్య అన్నా రు. సమావేశంలో కలెక్టర్ హనుమంతు జండగే, అదనపు కలెక్టర్ (రెవెన్యూ) షాలోమ్ బెన్షా, ఆర్డీవో అమరేందర్, ఇరిగేషన్ ఎస్‌ఈ శ్రీనివాస్, డీఈఈ రఘు నాధ్ తదితరులు పాల్గొన్నారు.