శేరిలింగంపల్లి, నవంబర్ 16: నెలలు నిండకుండానే పుట్టిన పిల్లలని ఎదిగే క్రమంలో కంటికి రెప్పలా కాపాడుకోవాలని మెడికవర్ ఉమన్ అండ్ చైల్డ్ హాస్పిటల్స్ వైద్యులు పేర్కొన్నారు. శనివారం హైటెక్‌సిటీలోని మెడికవర్ ఉమెన్ అండ్ చైల్డ్ హాస్పిటల్స్ “సెలబ్రేటింగ్ టైనీ మిరాకిల్స్ ప్రీమెచ్యూరిటీ డే అనే ఉత్సవాన్ని వైభవంగా నిర్వహించింది.
ప్రీటర్మ్ బేబీల జీవితాల్లోని ఆశ్చర్యకర ప్రయాణాలను గౌరవిస్తూ, వైద్య నిపుణులు, తల్లిదండ్రులు, సమాజాన్ని ఒకచోట చేర్చి సీనియర్ నియోనాటాలజిస్టు డాక్టర్ పరిగే రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమానికి మెడికవర్ గ్రూప్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ హరికృష్ణ ముఖ్య అతిథిగా పాల్గొని ఆసుపత్రి నియోనేటల్ కేర్ అభివృద్ధిపై తన అభిప్రాయాలను వెల్లడించారు.
డాక్టర్ రవీందర్‌రెడ్డి పెరిగే మాట్లాడుతూ నెలలు నిండకుండా అంటే 23 నుంచి 37 వారాలలోపే పుట్టే పిల్లలందరినీ ప్రీ మెచ్యుర్ అని, 28 వారాలలోపే పుట్టే పిల్లలు ఎక్స్‌ట్రీమ్ ప్రీ మెచ్యూర్ బేబీస్ అని అంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ నవిత, డాక్టర్ వంశీ, డాక్టర్ రాధిక, డాక్టర్ ఎస్వీ లక్ష్మీ, డాక్టర్ మధుమోహన్‌రెడ్డి, డాక్టర్ జనార్ధరెడ్డి ఇతర వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.