calender_icon.png 26 February, 2025 | 4:09 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రేమకు జై కూడా అలాంటి చిత్రమే

25-02-2025 12:00:00 AM

ఈశ్వర పరమేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై అనసూర్య నిర్మించిన చిత్రం ‘ప్రేమకు జై’. అనిల్ బురగాని, ఆర్ జ్వలిత హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. శ్రీనివాస్ మల్లం దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను మేకర్స్ మార్చిలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను హైదరాబాద్‌లో నిర్వహించారు. ఈ వేడుకలో అతిథిగా పాల్గొన్న దర్శకనిర్మాత సాయివెంకట్ మాట్లాడుతూ.. “ప్రేక్షకులు.. చిన్న బడ్జెట్ సినిమానా? భారీ బడ్జెట్ సినిమానా? అని చూడరు. బాగుంటే ఏ సినిమానైనా బ్లాక్‌బస్టర్ చేస్తారు.

అలాంటి సినిమాల జాబితాల్లోకే వస్తుందీ ‘ప్రేమకు జై” అన్నారు. చిత్ర దర్శకుడు మల్లం శ్రీనివాస్ మాట్లాడుతూ.. ‘ఈ సినిమాను గ్రామీణ నేపథ్యంలో చోటుచేసుకున్న ఒక యధార్థ సంఘటన ఆధారంగా తెరకెక్కించాం’ అని తెలిపారు. ‘ఇంత మంచి సినిమాలో తమకు అవకాశం ఇచ్చిన దర్శకనిర్మాతలకు కృతజ్ఞతలు’ అని హీరోహీరోయిన్లు అనిల్, జ్వలిత చెప్పారు. ఇంకా ఈ కార్యక్రమంలో కో ప్రోడ్యూసర్ మైలారం రాజు, నటుడు అదిరే అభి, నిర్మాత ఎంఆర్ చౌదరి వడ్లపట్ల, నిర్మాత చందర్‌గౌడ్, దర్శకుడు లారెన్స్ పలువురు సినీ ప్రముఖులు పాల్గొన్నారు.