calender_icon.png 28 October, 2024 | 6:56 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రేమ మందిరం.. బృందావనం

28-10-2024 12:00:00 AM

శ్రీ కృష్ణుడు, రాధల ప్రేమ మందిరం బృందావనం. ఇది ఉత్తర ప్రదేశ్‌లోని పవిత్ర నగరాలలో ఒకటి. ఈ నగరాన్ని సందర్శించడానికి భారతదేశం నుంచే కాకుండా విదేశాల నుంచి భక్తులు తరలివస్తుంటారు.  బృందావన్‌లో ప్రసిద్ధి చెందిన ఆలయాలు ఎన్నో ఉన్నాయి. అవేంటో చూద్దాం పదండి..   

బృందావనంలోని పురాతన ఆలయాలకు వందల వేల సంవత్సరాల చరిత్ర ఉంది. ఇందులోని శ్రీకృష్ణ పరమాత్ముడిని ఆయన మునిమనవడైన వజ్రనాభ్ స్వయంగా పూజించేవారని పురాణాలు చెబుతున్నాయి. ఔరంగజేబు ఈ దేవాలయాన్ని నాశనం చేసేందుకు ఎన్నిసార్లు ప్రయత్నించినా సాధ్యం కాలేదని చరిత్ర చెబుతున్నది.

మధురతో పాటు బ్రజ్‌కు ప్రతిరోజు లక్షలాది మంది భక్తులు శ్రీకృష్ణుడి దర్శనానికి వస్తుంటారు. ఇందులో బృందావనానికి అత్యధిక సంఖ్యలో భక్తులు వస్తుంటారు. నిజానికి బృందావనం శ్రీకృష్ణుడి తన కాలక్షేపం ఏర్పాటు చేసుకున్న ప్రదేశం. దీని కారణంగానే ఎక్కువమంది భక్తులు ఇక్కడికి వచ్చి స్వామిని దర్శించుకొని తరిస్తుంటారు. బృందావనంలో వందల వేల సంవత్సరాల నాటి ఎన్నో దేవాలయాలు ఉన్నాయి. పురాణాల పరంగా అవి ఎంతో ప్రసిద్ధి చెందిన ఆలయాలు. 

పురాతన ఆలయం: బృందావనంలో తప్పక చూడాల్సిన ఆలయాల్లో ఇది ఒకటి. దీనికి ఐదువేల సంవత్సరాల చరిత్ర ఉంది. ఈ ఆలయంలో శ్రీకృష్ణుని మనవడు వజ్రనాభుడు పూజలు చేసినట్లు పురాణాలు చెపుతున్నాయి. కానీ ఔరంగజేబు దండయాత్ర కారణంగా ఆలయ అసలు నిర్మాణం పూర్తిగా ధ్వంసమైంది. గోపీనాథ్ దేవాలయంలోని విగ్రహాలను ఆక్రమణ నుంచి రక్షించడానికి జైపూర్‌లో ప్రతిష్టించారు. చివరగా బృందావనంలోని ఎత్తున కొండపై ఉన్న శ్రీ రాధా మోహన్ ఆలయం వస్తుంది. ఈ ఆలయం బాంకే బిహారీ ఆలయానికి చాలా దగ్గరగా ఉంటుంది. 

రాధా రామస్ ఆలయం: బృందావనంలోని ఠాకూర్‌కు అంకితం చేయబడిన ఏడు దేవాలయాలలో శ్రీ రాధా రామన్ మందిర్ ఒకటి. రాధా రామన్ ఆలయం బృందావన్ రైల్వే స్టేషన్ నుంచి రెండు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. 

 శ్యామ శ్యామ్‌ధామ్ బృందావన్: ఈ పాలరాతి కట్టడానికి ఎవరైనా ఆకర్షితులవుతారు. ఆధ్యాత్మిక అన్వేషికులు, భక్తులు ఇక్కడికి వేల సంఖ్యలో వస్తారు. దీన్నే ‘ది టెంపుల్ ఆఫ్ డివైన్ లవ్’ అని కూడా పిలుస్తారు. ఈ ఆలయంలో శ్రీ రాధా, కృష్ణ, శ్రీ సీతారాములను చూడొచ్చు. ఈ మందిరాన్ని రాజస్థానీ, గుజరాతీ వాస్తుశిల్ప శైలిలో నిర్మించారు. ఈ నిర్మాణానికి ఇటాలియన్ వైట్ మార్బుల్‌ను వాడారు. ఈ మందిరం మొత్తం బృందావనం శివార్లలో 54 ఎకరాల విస్తీర్ణంలో ఉంటుంది. 

ఎలా వెళ్లాలి: బృందావనం వెళ్లడానికి న్యూఢిల్లోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకోవాలి. అక్కడి నుంచి టాక్సీ లేదా డొమెస్టిక్ ప్లుట్సైలో కూడా బృందావనానికి వెళ్లవచ్చు. అలాగే ఢిల్లీ, ఆగ్రా నుంచి నేరుగా బృందావనం రైల్వే స్టేషన్‌కు వెళ్లి.. అక్కడి నుంచి బస్సులు లేదా ప్రైవేట్ వాహనాల ద్వారా బృందావనాన్ని చేరుకోవచ్చు. బస్సులో అయితే ఢిల్లీ, ఆగ్రా, మధుర నుంచి అనేక ప్రభుత్వ, ప్రైవేట్ బస్సులు నడుస్తుంటాయి.