calender_icon.png 20 April, 2025 | 2:14 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

స్వగ్రామానికి చేరుకున్న ప్రేమ్ సాగర్ మృతదేహం

19-04-2025 11:00:16 PM

నిర్మల్ (విజయక్రాంతి): నిర్మల్ జిల్లా సోన్ మండల కేంద్రానికి చెందిన ఆస్తా ప్రేమ్ సాగర్ ఇటీవలే గల్ఫ్ దేశంలో పాకిస్తాన్ యువకుడి చేతిలో హత్యకు గురైన సంగతి తెలిసింది. వారం రోజుల క్రితం బేకరీలో పనిచేస్తున్న ప్రేమ్ సాగర్ ను పాకిస్తాన్ కు చెందిన ఓ యువకుడు హత్య చేసినట్టు కుటుంబ సభ్యులకు సమాచారం రావడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది, హత్య గావించబడ్డ ప్రేమ్ సాగర్ మృతి దేహాన్ని ఇండియాకు రప్పించేందుకు స్థానిక ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అక్కడి ప్రభుత్వంతో సంప్రదింపులు నిర్వహించి మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకువచ్చారు, శుక్రవారం సాయంత్రం 4 గంటలకు ప్రేమ సాగర్ మృతదేహం గ్రామానికి చేరుకోవడంతో కుటుంబ సభ్యులు గ్రామస్తులు కన్నీరు మున్నేరు అయ్యారు అనంతరం అంత్యక్రియలు నిర్వహించారు, మృతునికి భార్య ఇద్దరు పిల్లలు ఉండగా కొడుకు శవాన్ని చూసిన తల్లి తీవ్ర అస్వస్థత గురై అస్వస్థతకు గురై కుప్పకూలిపోవడంతో ఆమెను ఆసుపత్రికి తరలించారు.