- పార్టీ పోలిట్‌బ్యూరో సభ్యుడు అరవింద్‌కుమార్‌గౌడ్
- నేడు చంద్రబాబుకు ఎన్టీఆర్ భవన్‌లో సన్మానం
హైదరాబాద్, జూలై 6 (విజయక్రాంతి): సమిష్టిగా పనిచేసి తెలంగాణలో టీడీపీకి పూర్వ వైభవం తీసుకొస్తామని పార్టీ పోలిట్‌బ్యూరో సభ్యుడు అరవింద్‌కుమార్‌గౌడ్ పేర్కొన్నారు. నాలుగోసారి సీఎం అయిన తర్వాత తొలిసారి హైదరాబాద్‌కు వచ్చిన చంద్రబాబుకు స్వాగతం పలకడానికి వచ్చిన టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులకు ఆయన ధన్యవాదములు తెలిపారు. శనివారం ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. 2028 ఎన్నికలే లక్ష్యంగా పని చేస్తామని స్పష్టంచేశారు.
కాగా, చంద్రబాబు ఆదివారం ఎన్టీఆర్ భవన్‌ను రానున్నారు. ఈ క్రమంలో ఆయనను తెలంగాణ టీడీపీ నాయకులను సన్మానించనున్నారు. ఇందుకు సబంధించిన ఏర్పాట్లపై పోలిట్‌బ్యూరో సభ్యులు బక్కని నరసింహులు, అరవింద్‌కుమార్‌గౌడ్, పార్టీ రాష్ర్ట వ్యవహారాల సమన్వయ కర్త కంభంపాటి రామ్మోహన్‌రావు, క్రమశిక్షణా కమిటీ సభ్యులు బంటు వేంకటేశ్వర్లు, అధికార ప్రతినిధి నన్నూరి నర్సిరెడ్డి ఆధ్వర్యంలో చర్చించారు.